ఒక్కప్పుడు కొత్త సినిమా వస్తే… కొన్ని రోజులు ఆగి పైరసీ ప్రింట్స్ ని లోకల్ టీవీ లో వేసేవారు, తర్వాత కొత్త సినిమాలు రిలీజ్ అయిన నెల రెండు నెలలకే సినిమాల మాస్టర్ ప్రింట్స్ రిలీజ్ అవుతుండటం తో అప్పుడు అనేక సార్లు లోకల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేసేవాళ్ళు, వీటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే అప్పటికే సినిమాను చాలా మంది చూసి ఉంటారు కాబట్టి… కానీ ఇప్పుడు టైం వేరు…
థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు, చిన్న పెద్దా సినిమాలు అన్నీ కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని, శాటిలైట్ రైట్స్ నే నమ్ముకుని ఉండగా శాటిలైట్ రైట్స్ కొన్న వాళ్ళు మంచి డేట్ చూసుకుని సినిమా ను టెలికాస్ట్ చేసుకోవాలని ప్లానింగ్ లో ఉండగా…
మరో పక్క రిలీజ్ అయిన సినిమా అయినట్లు లోకల్ ఛానెల్స్ లో మాస్టర్ ప్రింట్ ని టెలికాస్ట్ చేస్తున్నాయి. దాంతో ఇన్నాళ్ళు ఊరుకున్న ఛానెల్స్ ఇప్పుడు కొంచం సీరియస్ అవుతున్నారు, చాలా టైం తర్వాత శాటిలైట్ రైట్స్ కొనడం మొదలు పెట్టిన ఈటీవీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ను లోకల్ ఛానెల్ లో వేస్తె కోపగించుకున్నా కానీ…
ఆగకుండా ఇప్పుడు రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ అయిన టాలీవుడ్ బిగ్ మూవీ వి రిలీజ్ అయిన రోజునే హైదరాబాదులో లోకల్ ఛానెల్ టెలికాస్ట్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న జెమినీ టీవీ కోపంతో ఆ ఛానెల్ కి ఏకంగా 2 కోట్ల ఫైన్ కట్టండి అంటూ నోటిసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ సినిమా హక్కులను 8 కోట్లు పెట్టి కొన్న జెమినీ టీవీ త్వరలో టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అవుతుంటే…. రిలీజ్ అయిన మొదటి రోజే లోకల్ ఛానెల్ లో వేయడం తో ఇది వరకు రైట్స్ కొన్న సినిమాలు టెలికాస్ట్ చేసినా ఊరుకున్నా ఈ సారి భారీ ఫైన్ తో షాక్ ఇచ్చింది. ఇక ఛానెల్ ఎం చేస్తుందో చూడాలి మరి… ఇలా ఒకటి రెండు సార్లు జరిగితేనే లోకల్ ఛానెల్స్ కూడా కొంచం తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.