మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా అవకాశం చాలా తక్కువ మందికే దొరుకు తుంది, అలాంటి అవకాశం సొంతం చేసుకున్న హీరోల్లో మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. మొదటి సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఉప్పెన సినిమా తో సమ్మర్ రేసులో ముందుగా ఆడియన్స్ ముందుకు వస్తాడు అనుకున్నా కానీ…
కరోనా ఎఫెక్ట్ తో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ట్రై చేసినా నిర్మాతలు ఏమి చెప్పకపోవడం తో సినిమా పై క్లారిటీ లేకుండా పోయింది, ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా లెవల్ లో మూవీ మొదలు పెట్టి కరోనా వల్ల ఆపేసిన…
క్రిష్ సడెన్ సర్ప్రైజ్ గా పంజా వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో కొత్త సినిమాను మొదలు పెట్టాడు, ఇక రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అనుకున్న టైం లో రీసెంట్ గా యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం తో ఇప్పుడు యూనిట్ మొత్తం పానిక్ అయ్యారట.
ఒకరి నుండి ఒకరికి ఈజీగా పాకే ఈ వైరస్ ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదని షూటింగ్ ని పోస్ట్ పోన్ చేయగా మినిమం నెల రెండు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, మరో పక్క అక్టోబర్ లేదా నవంబర్ టైం కి పవన్ వకీల్ సబ్ లో బాలెన్స్ షూట్ ని…
మొదలు పెట్టె అవకాశం ఉండటం తో ఇప్పుడు క్రిష్ పవన్ తో సినిమా పై ఫోకస్ పెట్టాలా లేక వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న సినిమా గురించి ఆలోచించాలా అన్న డైలమాలో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పై కొత్త అప్ డేట్ వస్తుందని అంటున్నారు. సినిమా మాత్రం ఒక్క సారి మొదలు పెడితే సింగిల్ షెడ్యూల్ లో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేయాలి అన్నది క్రిష్ ఆలోచన…