టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ మూడేళ్ళ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సినిమా వకీల్ సాబ్, ఒక ఎక్స్ టెండెడ్ క్యామియో తోనే పవర్ స్టార్ సెన్సేషనల్ యుఫోరియా సృష్టించిన ఈ సినిమా సమ్మర్ రేసులో సెన్సేషనల్ క్రేజ్ నడుమ రిలీజ్ అవ్వగా రిలీజ్ టైం లో ఆంధ్రాలో టికెట్ రేట్ల తగ్గింపు గొడవ వలన తర్వాత సెకెండ్ వేవ్ ఇంపాక్ట్ వలన….
బాక్స్ ఆఫీస్ రన్ ని అతి తక్కువ టైం మాత్రమే సొంతం చేసుకోవడం జరిగింది. దాంతో సినిమా కలెక్షన్స్ పై అవి తీవ్రంగా ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేసినా అప్పటికే చాలా వరకు రికవరీ అయ్యింది సినిమా. ఇక తర్వాత సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ ను…
రీసెంట్ గా చేయగా సినిమా టెలికాస్ట్ టైం లో ఇతర ఛానెల్స్ లో కూడా పోటి కి వరుస పెట్టి సినిమాలను టెలికాస్ట్ చేశారు… దాంతో పాటు క్రికెట్ మ్యాచ్ కూడా ఉండటం తో ఇంపాక్ట్ కి రేటింగ్ పడిపోతుందా అనే అనుమానాలు రేకేత్తగా మొత్తం మీద పరిస్థితులను అన్నీ చూసి…
సినిమా అటూ ఇటూగా 16-18 మధ్యలో వస్తుందేమో అని మేం అంచనా వేశాం… కానీ సినిమా మేం వేసిన అంచనాను మించి పోయే రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఓవరాల్ గా 19.12 రేటింగ్ ను సొంతం చేసుకుని సాలిడ్ రేటింగ్ తో దుమ్ము లేపింది. సినిమా కి ఇతర ఛానెల్స్ లో ఈ మధ్య ఇతర టాప్ స్టార్ సినిమాల మాదిరి…
పోటి ఏమి లేకుండా ఉండి ఉంటే కచ్చితంగా సినిమా రేటింగ్ ఇంకా ఎక్కువే వచ్చి ఉండేది అని చెప్పాలి. అయినా కానీ పోటి లో దుమ్ము లేపే రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా జీ తెలుగు టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఓవరాల్ గా టాప్ 10 TRP రేటింగ్ మూవీస్ లో మాత్రం చోటు సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా.