బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అనేక అనుకోని అవరోధాలను ఎదురుకుని కూడా మొదటి వారం సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఇంకా అవరోధాలను ఎదురుకుంటూ వస్తుంది కానీ ఒక పక్క మిగిలిన కొత్త సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫేడ్ అవుట్ అయిన నేపధ్యంలో…
వకీల్ సాబ్ మాత్రమే థియేటర్ ఓనర్స్ కి ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చేలా చేస్తున్న సినిమా. అయినా కానీ సినిమా కి 12 వ రోజు నుండే ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్లు, తెలంగాణా లో సాయంత్రం 6 నుండి ఎలాంటి షోలు లేకుండా మరింత ఎఫెక్ట్ కలగడం మొదలు అయింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 135 కోట్ల గ్రాస్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. అదే సినిమా నార్మల్ టైం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుకూల పరిస్థితులు ఉండి ఉంటే ఈ రచ్చ మరో రేంజ్ లో ఉండి ఉండేదని చెప్పొచ్చు.
అదే టైం లో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కొంచం ముందు పరిస్థితులను ఊహించి ఏర్పిల్ మొదటి వారానికే సెట్ చేసి ఉంటే ఈ పాటికే సినిమా సాలిడ్ లాభాలతో దుమ్ము లేపి ఉండేది.. కానీ ముందు అనుకున్న డేట్ కే ఫిక్స్ అవ్వడం, కానీ పరిస్థితులు ఒకటి తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు కొడుతూ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1…
మూవీ గా నిలిచిన ఈ సినిమా ఓవరాల్ గా ఆంధ్రాలో అనుకోని సమస్యలు అలాగే సెకెండ్ వేవ్ ఎఫెక్టుల వలన ఇబ్బంది పడ్డా పవర్ స్టార్ తన క్రేజ్ పవర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని ఇంకా సాధించగలుగుతుందో చూడాలి ఇక..