టాలీవుడ్ లో ప్రతీ ఇయర్ ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో పెద్ద హీరోలు నటించిన సినిమాలు కూడా ఉంటాయి, మిగిలిన సినిమాలతో పోల్చితే పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ లు, బిజినెస్ లు ఎక్కువ కాబట్టి ప్రభుత్వాల సహకారంతో టికెట్ రేట్లని పెంచుకుని మొదటి వారం రెండు వారాల్లో టికెట్ హైక్స్ తో వీలైనంత అమౌంట్ ను వెనక్కి తీసుకోచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. దానికి ఎవ్వరూ ఇప్పటి వరకు అడ్డంకి చెప్పలేదు కూడాను.
కానీ రీసెంట్ టైం లో ప్రతీ మీడియం రేంజ్ మూవీ కి కూడా ఇలానే టికెట్ హైక్స్ పెట్టడం మొదలు పెట్టారు, దాన్ని అందరూ తప్పు పట్టినా ఎవ్వరూ పట్టించుకోలేదు, ఇక ఇలాంటి టైం లో భారీ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ అవ్వగా, రిలీజ్ రోజు కి ముందు బెనిఫిట్ లు, అన్ని చోట్లా ప్లాన్ చేశారు. ఇక టికెట్ హైక్స్ ఆల్ రెడీ పెట్టె బుకింగ్స్ అన్ని ఓపెన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలగజేసుకుని టికెట్ హైక్స్ ని తగ్గించాలని….
బెనిఫిట్ షోలు స్పెషల్ షోలకి పర్మీషన్ లేదని ఉన్న పళంగా కాన్సిల్ చేయించింది… దాంతో రిలీజ్ రోజు రాత్రంతా నానా హంగామా జరగగా కొన్ని చోట్ల ఫ్యాన్స్ గొడవలు చేయడంతో బెనిఫిట్ షోలు పడ్డా… టికెట్ హైక్స్ కంప్లీట్ గా తగ్గిస్తూ కొత్త జీవో ని పాస్ చేశారు. ఇవే ఇక మీదట కొత్త టికెట్ రేట్స్ అంటూ చెబుతూ, థియేటర్ ఓనర్స్…. ఎవరైనా టికెట్ రేట్లు పెంచినట్లు తెలిస్తే కటిన చర్యలు….
తీసుకుంటామని పోలిస్ రైడ్స్ అన్ని థియేటర్స్ లో చేయాలనీ డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పుడు వకీల్ సాబ్ కి కలెక్షన్స్ పరంగా ఇది తీవ్రంగా ఇంపాక్ట్ చూపే అవకాశం ఎంతైనా ఉంది. తెలంగాణాలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆంధ్రాలో ఇప్పుడు కలెక్షన్స్ కి గట్టి ఎదురుదెబ్బ పడబోతుంది.. ఇక ఈ టికెట్ రేట్ల తగ్గింపు అప్ కమింగ్ బిగ్ మూవీస్ కి కూడా ఇలానే కొనసాగుతుందా లేదా అప్పుడు మళ్ళీ పెంచుకోండి అంటారో చూడాలి ఇక…