Home న్యూస్ వకీల్ సాబ్ రివ్యూ….పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!!

వకీల్ సాబ్ రివ్యూ….పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్, ఆడియన్స్ ముందుకు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ మూవీ అంచనాలను ఎంతవరకు అందుకుంది, పవర్ స్టార్ కి ఎలాంటి కంబ్యాక్ మూవీ గా నిలిచింది, బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ ని మరిపించిందా లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే… హైదరాబాదులో ఒక ఏరియాలో గడ్డం పెంచుకుని మందు తాగుతూ తిరిగే హీరో…

తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని ఇంసిడెంట్స్ వలన తను ఎంతో ఇష్టపడే లాయర్ జాబ్ ను మానేస్తాడు… ఇక హైదరాబాదులో తన ఏరియాలోనే ఉండే ముగ్గురు అమ్మాయిలు నివేదా ధామస్, అంజలి, అనన్యలు అనుకోకుండా ఒక మినిస్టర్ కొడుకు…

బ్యాచ్ ని కొట్టడంతో వాళ్ళు ఈ ముగ్గురు అమ్మాయిలపై కేసు వేస్తారు… వీళ్ళ గురించి తెలిసిన హీరో కొంచం హెల్ప్ చేయాలనీ చూస్తె… విలన్ బ్యాచ్ హీరోని బయపెట్టాలని చూస్తుంది… తర్వాత హీరో ఏం చేశాడు, ఇంతకీ ఆ ముగ్గురు అమ్మాయిల పరిస్థితి ఏమైంది.. హీరో ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టొరీ లో శృతి హాసన్ రోల్ ఏంటి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పింక్ మూవీ కి రీమేక్ అయినా కానీ కోర్ పాయింట్ ని అలానే తీసుకుని ట్రీట్ మెంట్ మొత్తం మార్చేశాడు డైరెక్టర్… ఒక పక్క అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథ ముందుకు వెళుతూనే, హీరో ఇన్వాల్వ్ మెంట్ చూపెడుతూ కథకి కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ మరీ అనుకున్న విధంగా లేదు… అదొక్కటే కొంచం ఇబ్బంది పెట్టిన అంశం…

అండ్ ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది…బట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యాక ఇక సినిమా ఇంటర్వెల్ ఫుల్ హై మూమెంట్స్ తో నిండిపోగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోతాయి, ఇక సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా అదే ఫ్లో ని మెయిన్ టైన్ చేస్తూ వెళుతుంది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు డిఫెరెంట్ షేడ్స్ లో తన బెస్ట్ ఇచ్చాడు, ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ తో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా కుమ్మేశాడు, కోర్ట్ సీన్స్ లో ప్రకాష్ రాజ్ ను ఫుల్ డామినేట్ చేశాడు. హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో తన పవర్ చూపెట్టాడు. ఇక నివేదా థామస్ కి బెస్ట్ సీన్స్ పడగా…

అంజలి మరియు అనన్యలు బాగానే నటించారు, ప్రకాష్ రాజ్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు, శృతి హాసన్ రోల్ చిన్నదే అయినా పర్వాలేదు అనిపిస్తుంది…. ఇక సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ అందించిన సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగుండగా…

పాటలను కూడా మించేసి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో దుమ్ము లేపేశాడు తమన్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై ఉన్న ప్రతీ సారి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో హై ఫీల్ అయ్యేలా చేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ జస్ట్ ఓకే కానీ సెకెండ్ ఆఫ్ బాగుంది…. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి..

డైలాగ్స్ చాలా బాగుండగా కోర్ట్ రూమ్ డైలాగ్స్ చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఒక సీరియస్ కథని రీమేక్ అయినా ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఇంప్రూవ్ మెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించేలా తీర్చిదిద్దే విధంగా మలచడంలో వేణు శ్రీ రామ్ విజయం సాధించారు. పవర్ స్టార్ ని తాను ఎలా చూపెట్టాలి అనుకున్నారో…

అలా చూపెట్టి ఫ్యాన్స్ కోరుకునే అంశాలను కథకి ఇబ్బంది లేకుండా జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కానీ అదే సమయంలో ఫస్టాఫ్ లో టేక్ ఆఫ్ కి టైం తీసుకోవడం ఫ్లాష్ బ్యాక్ మరీ అనుకున్న విధంగా లేకపోవడం లాంటివి డ్రా బ్యాక్స్… స్టిల్ సినిమా కథ టేక్ ఆఫ్ అయ్యాక ఇవన్నీ ఆడియన్స్ మర్చిపోవడం ఖాయం…

మొత్తం మీద ఒరిజినల్ ని చూసిన వాళ్ళు కూడా సినిమా బాగుంది అనడం ఖాయం… ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్…. రీమేక్ ని అలానే సీన్ బై సీన్ లా తీయకుండా మార్పులు చేర్పులు చేయడం, అవి ఆడియన్స్ కి నచ్చే విధంగా మలచడంలో టీం సక్సెస్ అయ్యారు, ఇక ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here