టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పాగా ఒప్పుకున్నా మొట్ట మొదటి సినిమా వకీల్ సాబ్… అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయ్యి పరుగును ముగించి టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి ఉండేది కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉన్న విషయం అందరి కీ తెలిసిందే.
రీసెంట్ గా మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. కాగా సినిమా మరో పక్క డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం రికార్డ్ లెవల్ లో ఆఫర్లు వచ్చినా కానీ మేకర్లు నో చెప్పగా…
ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా శాటిలైట్ రైట్స్ ని అమ్మేశారని సమాచారం… టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను టాలీవుడ్ లీడింగ్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. దీనికోసం రికార్డ్ లెవల్ లో రేటు కూడా ఇచ్చారట.
రీమేక్ సినిమా అవ్వడం పవన్ కళ్యాణ్ కేవలం 40 నిమిషాల రేంజ్ ఎక్స్ టెండెడ్ క్యామియో చేస్తున్నాడు అని తెలిసినా కానీ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా కోసం ఏకంగా 16.5 కోట్ల రేంజ్ రేటు ఇచ్చి హక్కులను సొంతం చేసుకుందట జెమినీ టీవీ.. రీసెంట్ టైం లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్లలో ఒకటిగా చెప్పుకోవాలి.
రీసెంట్ గా చాలా బిగ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ ని డిజిటల్ రైట్స్ తో కలిపి అమ్ముతున్నారు, దాంతో శాటిలైట్ రైట్స్ పెర్ఫెక్ట్ గా ఎంత బిజినెస్ చేసిందని బయటికి పెద్దగా న్యూసులు రావడం లేదు, అయినా కానీ వకీల్ సాబ్ ఓన్లీ శాటిలైట్ రైట్స్ తోనే సెన్సేషనల్ బిజినెస్ ని సొంతం చేసుకుని అంచనాలను మరింత పెంచగా వచ్చే ఇయర్ రానున్న ఈ సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి మరి.