OTT యాప్స్ అన్ని కూడా ముందు డైరెక్ట్ రిలీజ్ కోసం సినిమాలను ఒప్పించడానికి భారీ రేట్లు ఎగచూపినా ఒక్క పెద్ద సినిమా వస్తే తర్వాత తాము చెప్పిందే రేటు అవుతుందని అనుకున్నాయి, అనుకున్నట్లే నాని వి మూవీ టాలీవుడ్ తరుపున డైరెక్ట్ రిలీజ్ కి ఓకే చెప్పగా ఇక అప్పటి నుండి ఇతర సినిమాల రేట్లు మారడం మొదలు పెట్టాయి, ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే చాలా సినిమాల రేట్లు మాత్రం…
తగ్గుతూనే ఉన్నాయి అని చెప్పాలి. కానీ విశేషంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీ ఆల్ రెడీ ఒరిజినల్ వర్షన్ అలాగే మొదటి రీమేక్ వర్షన్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నా కానీ తెలుగు లో మాత్రం…
సాలిడ్ రేట్లు పెరుగుతూనే పోతుండటం విశేషం అనే చెప్పాలి. ముందు 75 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ చేయగా తర్వాత కొంత గ్యాప్ ఇవ్వగా మళ్ళీ సినిమా పోస్టర్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక క్రేజ్ చూసి రేట్లు పెంచడం మొదలు పెట్టారు, 80 కోట్ల రేటు ఆఫర్ చేసినా నిర్మాతలు నో చెప్పగా…
ఇప్పుడు నెల ఎండ్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి జరుగుతున్న నేపధ్యంలో ఈ సారి రేటు మరింత పెంచి బిగ్గెస్ట్ రేటు ని టాలీవుడ్ మూవీస్ లో ఆఫర్ చేశారు. రేటు అమాంతం పెంచేసి 95 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఆఫర్ ని కోట్ చేయగా ఆఫర్ కి కొంచం టెంప్ట్ అయినా..
నిర్మాతలు సినిమా ను అమ్మం అని తెల్చేశారని సమాచారం. ఈ నెల ఎండ్ నుండి తిరిగి షూటింగ్ మొదలు కాబోతున్న సినిమాలో పవన్ సీన్స్ కొంచం లేట్ గా చిత్రీకరించబోతున్నారు. నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయితే.. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి పరిస్థితులను బట్టి సంక్రాంతి రేసు లో సినిమా నిలుస్తుందని అంటున్నారు.