రీసెంట్ టైం లో ఏ సినిమా విషయం లో జరగనిది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ విషయం లో జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సినిమాల విడుదల టైం లో టికెట్ రేట్లని పెంచుకోవచ్చని రెండు రాష్ట్రాలా ప్రభుత్వాలు రీసెంట్ గానే అనుమతి ఇచ్చాయి. కానీ ఈ అడ్వాంటేజ్ ను చాలా సినిమాలు క్రేజ్ ఉన్న లేకున్నా బజ్ ఉన్నా లేకున్నా పెంచుకుని వాడుకోగా…
వాటితో పోల్చితే పెద్ద సినిమా అయినా వకీల్ సాబ్ కి పెట్టిన రేట్లు మరికాస్త ఎక్కువ అవ్వడం తో రేట్లు ఇంకాస్త పెంచారు, దాంతో తెలంగాణ ప్రభుత్వం ఏమి అనకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సినిమా పై సీరియస్ అయ్యి రేట్లు ఉన్న పళంగా తగ్గించాలి అంటూ ఆర్డర్స్ వేసింది.
దానికి హై కోర్టు టికెట్ హైక్స్ మూడు రోజుల పాటు పెంచుకోవచ్చు అంటూ మళ్ళీ తీర్పు ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టులో వాదనలను వినిపించగా… కోర్టు ఈ సారి ప్రభుత్వం తరపున నిలిచి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ టికెట్ రేట్ల ని నార్మల్ రేట్లకే అమ్మెల తీర్పు ఇచ్చింది.
కానీ అప్పటి వరకు జరిగిన టికెట్ హైక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా థియేటర్ ఓనర్లు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ సినిమా రిలీజ్ అయిన మూడో రోజు నుండి అన్ని సెంటర్స్ లో ప్రభుత్వం చెప్పిన టికెట్ రేట్లకే సినిమాలను ప్రదర్శించాలి అంటూ తీర్పు ఇచ్చింది. దాంతో ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కి మరింత ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఈ నిర్ణయం ఒక్క సినిమా విషయం లోనే కాదని ఫ్యూచర్ లో వచ్చే అన్ని పెద్ద చిన్న సినిమాల విషయం లో కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చింది… టికెట్ రేట్లు, 30,50, 70 ఇలా చాలా సెంటర్స్ లో ఉండబోతున్నాయి. ఆల్ మోస్ట్ 5-7 ఏళ్ల క్రితం రేట్లు ఇవి… మరి ఈ రేట్ల పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.