బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్ తో వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రంగం లోకి దిగాడు పవర్ స్టార్. కానీ పరిస్థితులు మరీ అనుకూలంగా లేకపోవడం ఒకింత నిరాశ పరిచినా ఉన్నంతలో మంచి జోష్ తో వకీల్ సాబ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటూ ఉండగా…
సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు పూర్తీ చేసుకుంది. సినిమా ఆస్ట్రేలియాలో 145K డాలర్స్ ని కలెక్ట్ చేయగా న్యూజిలాండ్ లో 8 వేల డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఇక సినిమా అమెరియాలో భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ సినిమాను మొత్తం మీద…
284 లోకేషన్స్ లో రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా అక్కడ అన్ని చోట్ల 30% కి పైగా ఆక్యుపెన్సీ తో లిమిటేషన్స్ లోనే రిలీజ్ అయింది, అయినా కానీ 2021 ఇయర్ కి గాను బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను ఇండియా తరుపున సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా అక్కడ ప్రీమియర్స్ తో…
301K డాలర్స్ ను సొంతం చేసుకోగా అన్ రిపోర్టెడ్ లోకేషన్స్ తో కలిపి 310K కి పైగానే డాలర్స్ ను సొంతం చేసుకుంది, సినిమా ఒక్క అమెరికాలోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 1.3 మిలియన్స్ రేంజ్ లో డాలర్స్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ ఇయర్ ఇప్పటి వరకు అక్కడ పరిస్థితులు మెరుగు అవుతూ ఉండగా రీసెంట్ గా వచ్చిన జాతిరత్నాలు 127K డాలర్స్ ని కలెక్ట్ చేసింది.
ఆ రికార్డ్ ను ఇప్పుడు వకీల్ సాబ్ బ్రేక్ చేసి ఇండియా తరుపున హైయెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్స్ ని ఈ ఇయర్ కి గాను సొంతం చేసుకుంది, నార్మల్ డేస్ లో రిలీజ్ అయ్యు ఉంటె ఈజీగా 1 మిలియన్ కి పైగా గ్రాస్ వచ్చి ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తో సినిమా దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…