Home న్యూస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇది….ఈ రేంజ్ రచ్చ అంచనా వేయలేదు!

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇది….ఈ రేంజ్ రచ్చ అంచనా వేయలేదు!

2230
0

సోషల్ మీడియా లో ఫ్యాన్స్ మధ్య మాటల గొడవ పెరిగి పెరిగి హీరో పేరిట ఓ ఊహకందని రికార్డ్ పెట్టాలి అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ అనుకున్నట్లే ఊరమాస్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించారు. ఇండియన్ రికార్డులు కాకుండా ఏకంగా వరల్డ్ రికార్డ్ నే సొంతం చేసుకుని రచ్చ చేసిన ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే మోషన్ పోస్టర్ లు రీసెంట్ గా రిలీజ్ అయ్యి…

ఫ్యాన్స్ సాధించిన రికార్డ్ తో మరింత హైప్ ను సొంతం చేసుకుంది… ఆ సినిమా నే కోలివుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై.. ఈ సినిమా అప్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులు ఎదురు చూసి చూసి…

సోషల్ మీడియా లో ట్రెండ్స్ కూడా చేయగా మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నది చెప్పనే లేదు… ఇక ఈ గ్యాప్ లో ఫ్యాన్ వార్స్ లో గొడవ వలన బుక్ మై షోలో ఏకంగా వరల్ద్ద్ వైడ్ మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మూవీ గా రికార్డ్ సొంతం చేసుకుంది వలిమై సినిమా…

ఇండియా తరుపున బాహుబలి 2 ఇది వరకు 1 మిలియన్ ఇంట్రెస్ట్ ను సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ 1.7 మిలియన్ ఇంట్రెస్ట్ తో వరల్డ్ రికార్డ్ కొట్టింది. ఇప్పుడు వలిమై ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే 1.73 మిలియన్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ కొట్టింది. ఇక లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను అలాగే…

మోషన్ పోస్టర్ ని కూడా సడెన్ గా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇచ్చారు టీం… లుక్స్ కొంచం అజిత్ ఇది వరకు నటించిన వివేగంని పోలి ఉన్నప్పటికీ ఓవరాల్ స్టైలింగ్ అండ్ క్వాలిటీ అదిరి పోయింది అని చెప్పాలి. ఈ ఇయర్ లోనే రాబోతుంది అంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here