Home న్యూస్ భీమ్లా నాయక్ రికార్డ్ బ్రేక్ చేసిన వలిమై..అరాచకం ఇది!

భీమ్లా నాయక్ రికార్డ్ బ్రేక్ చేసిన వలిమై..అరాచకం ఇది!

1566
0

కోలివుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజిత్ సినిమా వలిమై… విశ్వాసం బ్లాక్ బస్టర్ తర్వాత అజిత్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా కొనసాగుతూ ఉండగా సినిమా అప్ డేట్ కోసం చాలా సార్లు ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ కి మోషన్ పోస్టర్ తోనే అంచనాలను మించే రేంజ్ కిక్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు లేటెస్ట్ గా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి…

జోష్ మరింత పెంచారు… దాంతో ఫ్యాన్స్ ఇక యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతూ ఉండగా గ్లిమ్స్ కి రెస్పాన్స్ కూడా అదిరిపోయే లెవల్ లో వచ్చింది, బైక్ రేసింగ్ మీద తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ గ్లిమ్స్ విజువల్స్…

క్వాలిటీ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. గ్రాండ్ విజువల్స్ అజిత్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్ కార్తికేయ స్టైలిష్ విలనిజం, అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా గ్లిమ్స్ తో ఫ్యాన్స్ అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

భీమ్లా నాయక్ సినిమా గ్లిమ్స్ తో నెలకొల్పిన లైక్స్ రికార్డ్ ను 15 గంటల లోపే బ్రేక్ చేసి ఇప్పుడు సంచలనం సృష్టించారు. భీమ్లా నాయక్ గ్లిమ్స్ 24 గంటల్లో 728.6K లైక్స్ ని అందుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన అజిత్ ఫ్యాన్స్ 24 గంటల్లో సరికొత్త రికార్డులను నమోదు చేయబోతున్నారు. ఇక వ్యూస్ పరంగా కూడా 24 గంటల్లో కొత్త రికార్డులను నమోదు చేయడానికి…

అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. యూట్యూబ్ రికార్డుల విషయంలో కోలివుడ్ ముందు నుండి టాలీవుడ్ కన్నా బెటర్ గా రికార్డులను నమోదు చేస్తున్నారు. మన దగ్గరతో పోల్చితే అక్కడ టాప్ స్టార్స్ 2 మాత్రమె ఉండటం తో ఈ రికార్డులు సాధ్యం అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here