Home న్యూస్ వలిమై రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

వలిమై రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది… పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా తెలుగు రాష్ట్రాలలో మంచి రిలీజ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే….

సిటీలో కొందరు బైకర్స్ దొంగతనాలు చేస్తూ ఇతర క్రైమ్స్ తో పాటు డ్రగ్స్ మాఫియా ని కూడా మెయిన్ టైన్ చేస్తూ ఉండగా వీళ్ళందరినీ కార్తికేయ హెడ్ గా ఉంటాడు, వీళ్ళని సూపర్ కాప్ అయిన హీరో అజిత్ ఎలా పట్టుకున్నాడు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది అసలు కథ….

కథ పాయింట్ పరంగా చాలా సాధారనంగా ఉన్న స్టొరీ ని ఆల్ మోస్ట్ 3 గంటల లెంత్ తో తెరకెక్కించారు, అజిత్ కుమార్ తన రోల్ వరకు ఎక్స్ లెంట్ గా నటించి మెప్పించాడు, యాక్షన్ సీన్స్ తో, రేసింగ్ సీన్స్ తో దుమ్ము దులిపేశాడు, కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా అద్బుతంగా ఉన్నాయి…

ఇక కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి నెగటివ్ రోల్ లో నటించగా మరోసారి అలాంటి క్యారెక్టర్ తోనే మెప్పించాడు కార్తికేయ….మిగిలిన రోల్స్ లో హ్యుమా ఖురేషి చిన్న రోల్ లో ఆకట్టుకోగా మిగిలిన రోల్స్ కి పెద్దగా స్కోప్ లేదు…. ఇక సంగీతం జస్ట్ ఓకే అనిపించగా చాలా వరకు కథకి అడ్డుకట్టగా నిలిచింది అని చెప్పాలి… కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం….

యువన్ శంకర్ రాజా దుమ్ము దులిపేశాడు అని చెప్పాలి… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పింది…. సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే ఉన్నా లెంత్ ఎక్కువ అవ్వడం స్టోరీ పెద్దగా లేక పోవడంతో కథని కష్టంగా పొడగించాల్సి వచ్చినట్లు అనిపించింది….  ఇక యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో రచ్చ చేయగా సినిమాటోగ్రఫీ అండ్ గ్రాండియర్…..

భారీగా ఉండటంతో చాలా లావిష్ గా సినిమా ఉందని చెప్పాలి, తెలుగు డబ్బింగ్ బాగుండగా డైలాగ్స్ కూడా బాగున్నాయి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండగా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ వినోద్ ఫస్టాఫ్ వరకు అదిరిపోయేలా తీసినా కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ టైం కి సినిమా కంప్లీట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది…

సెకెండ్ ఆఫ్ లో కథ లేక పోవడంతో ఫోర్స్ సెంటిమెంట్ సీన్స్, హీరో విలన్ మైండ్ గేమ్ సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయి…. సెకెండ్ ఆఫ్ ని మరింత బాగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది కానీ ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ ని సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేకపోయింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా హైలెట్స్ విషయానికి వస్తే….

గ్రాండియర్ గా ఉన్న మూవీ, యాక్షన్ సీన్స్ అదిరిపోవడం, అజిత్ కుమార్ పెర్ఫార్మెన్స్, కార్తికేయ విలనిజం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం మరియు ఫస్టాఫ్ బాగుండటం హైలెట్స్ అవ్వగా కథ అస్సలు లేక పోవడం, ఫోర్స్ సెంటిమెంట్, పాటలు సినిమాకి అడ్డు పడినట్లు అనిపించడం, సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి….

మొత్తం మీద యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కొంచం ఓపికతో చూస్తె సినిమా పర్వాలేదు అనిపిస్తుంది కానీ లెంత్ కొంచం తగ్గించి ఉంటే మరింత బెటర్ అనిపించేది…. ఓవరాల్ గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ కి సినిమా నచ్చే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here