Home న్యూస్ ఒక రికార్డ్ కొట్టినా…ఇప్పటికీ భీమ్లా నాయక్ దే ఆల్ ఇండియా రికార్డ్!!

ఒక రికార్డ్ కొట్టినా…ఇప్పటికీ భీమ్లా నాయక్ దే ఆల్ ఇండియా రికార్డ్!!

1031
0

కోలివుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ నటించిన మోస్ట్ వాంటెడ్ మూవీ వలిమై కోసం ఫ్యాన్స్ కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉండగా సినిమా మోషం పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ రచ్చే చేయగా తర్వాత ఇప్పుడు సడెన్ గా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని ఫ్యాన్స్ కోసం సడెన్ సర్ప్రైజ్ గా రిలీజ్ చేశారు, కాగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఈ గ్లిమ్స్ కి సాలిడ్ గా వచ్చింది.

హై స్టాండర్డ్ తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకోగా రేసింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లిమ్స్ తోనే ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఇక ఈ గ్లిమ్స్ యూట్యూబ్ రికార్డుల వేట లో లైక్స్ పరంగా సంచలనాలను నమోదు చేసింది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ సినిమా గ్లిమ్స్ నమోదు చేసిన 24 గంటల లైక్స్ రికార్డ్ 728.6K లైక్స్ ను బ్రేక్ చేసి 24 గంటల్లో 785.3K లైక్స్ మార్క్ ని అందుకుని సరికొత్త ఇండియన్ రికార్డ్ ను గ్లిమ్స్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

కానీ అదే టైం లో వ్యూస్ పరంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లిమ్స్ ఇప్పటికీ ఇండియన్ రికార్డ్ ను హోల్డ్ చేసి అలానే కొనసాగుతూ ఉండటం విశేషం. లైక్స్ రికార్డ్ 15 గంటల టైం కే సొంతం చేసుకున్న వలిమై గ్లిమ్స్ వ్యూస్ పరంగా కూడా 24 గంటల్లో కొత్త రికార్డులను అందుకుంటుందేమో అనిపించినా 24 గంటల తర్వాత 6.87 మిలియన్ వ్యూస్ ని అందుకోగా…

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 8.49 మిలియన్ వ్యూస్ రికార్డ్ అలానే ఉండగా రెండో ప్లేస్ లో సైరా గ్లిమ్స్ 7.2 మిలియన్ వ్యూస్ తో ఉండగా ఇప్పుడు మూడో ప్లేస్ లో వలిమై గ్లిమ్స్ నిలిచింది. మొత్తం మీద లైక్స్ పరంగా ఇండియన్ రికార్డ్ కొట్టినా వ్యూస్ పరంగా ఇప్పటికీ భీమ్లా నాయక్ దే ఆల్ ఇండియా రికార్డ్ అని కన్ఫాం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here