మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మాస్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో ఫస్ట్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా సాంగ్ ప్రోమో ని ముందు రోజు రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్స్ కనిపించాయి. దాంతో దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ తో ఎంతవరకు న్యాయం చేసి ట్రోల్స్ ని మరిపిస్తాడో అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా…
వేర్ ఈజ్ ది పార్టీ లిరిక్ తో వచ్చిన బాస్ పార్టీ సాంగ్ చాలా వరకు మెప్పించింది అని చెప్పాలి. మెగాస్టార్ మెగా స్వాగ్ మొత్తం సాంగ్ లో మెప్పించాగా లిరిక్స్, మ్యూజిక్, కోరియోగ్రఫీ, మెగాస్టార్ లుక్స్, ఊర్వశి డాన్స్ ఇలా అన్నీ సాంగ్ లో బాగానే ఇంప్రెస్ చేశాయి.
వింటేజ్ మెగాస్టార్ స్టెప్స్ ను గుర్తు చేస్తూ స్వాగ్ తో వేసిన స్టెప్స్ కూడా మెప్పించగా ఓవరాల్ గా సాంగ్ ముందు వచ్చిన ట్రోల్స్ అన్నింటికీ కూడా చెక్ పెట్టింది అని చెప్పాలి. కొన్ని రోజులకు సాంగ్ రీచ్ కూడా సూపర్బ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా….
దేవి శ్రీ ప్రసాద్ మరీ అద్బుతం కాదు కానీ ఈ సాంగ్ తో మంచి మార్కులే దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ కి యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అండ్ లైక్స్ ని దక్కించుకుంటుందో చూడాలి…