Home న్యూస్ విజయ్ వారసుడు AP-TG బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

విజయ్ వారసుడు AP-TG బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

1

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్ టైం లో సాలిడ్ మార్కెట్ ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ నటించిన బీస్ట్ మూవీ అంచనాలను అందుకోక పోయినా మిగిలిన సినిమాలు మాత్రం దుమ్ము లేపే వసూళ్ళని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు మూవీ తెలుగు లో కూడా సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా రిలీజ్ లేట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వలన కొంచం అటూ ఇటూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా….

సినిమా నైజాం మరియు వైజాగ్ ఏరియాల్లో ఓన్ గానే రిలీజ్ కానుండగా మిగిలిన ఏరియాల్లో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ కూడా బాగానే జరిగింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే….

👉Nizam: 6Cr
👉Ceeded: 2Cr
👉Andhra: 8Cr
AP-TG Total:- 16.00CR
ఇదీ మొత్తం మీద వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న వాల్యూ బిజినెస్ రేంజ్ లెక్క… ఇది తెలుగు లో ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ వాల్యూ అని చెప్పాలి ఇప్పుడు…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పుడు క్లీన్ హిట్ ని సొంతం చేసుకోవాలి అంటే మినిమమ్ 17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా భారీ పోటిలో ఎలాంటి కలెక్షన్స్ తో ఈ బ్రేక్ ఈవెన్ ని అందుకుందో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here