Home న్యూస్ వర్షం4K రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….ప్రభాస్ మాస్ ఊచకోత!!

వర్షం4K రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….ప్రభాస్ మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం4K(Varsham4K Re Release) సినిమాను రీసెంట్ గా మూడో సారి రీ రిలీజ్ చేయగా మొదటి రెండు సార్లను మించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

రిలీజ్ కి ముందు రోజు వరకు సుమారు 33 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా రిలీజ్ రోజున ఆల్ మోస్ట్ 17 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరు చూపించగా ఓవరాల్ గా సినిమా 50 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను…

రిలీజ్ రోజుతో కలిపి దక్కించుకుంది. వీకెండ్ కి గాను రిలీజ్ కి ముందు వరకు అడ్వాన్స్ గ్రాస్ ఆల్ మోస్ట్ కోటి రేంజ్ లో దుమ్ము లేపగా మొదటి రోజు ఇండియాలో సినిమా మంచి జోరుని చూపించింది. ఓవరాల్ గా సినిమా ట్రేడ్ లెక్కల్లో మొదటి రోజు ఆల్ మోస్ట్ 1.7-1.8 కోట్ల రేంజ్ లో…

వసూళ్ళని సొంతం చేసుకుంది. అందులో మెజారిటీ వసూళ్లు నైజాం ఏరియా నుండి రాగా కోస్టల్ ఆంధ్ర లో కూడా మంచి ట్రెండ్ నే చూపించింది. ఇక సినిమా ఫస్ట్ టైం రీ రిలీజ్ లో 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సెకెండ్ టైం రీ రిలీజ్ లో 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

అవి టోటల్ గా ఆల్ మోస్ట్ 75 లక్షల రేంజ్ లో ఉండగా…ఇప్పుడు మూడో రీ రిలీజ్ లో అంచనాలను అన్నీ మించి పోయి ఎక్స్ లెంట్ నంబర్స్ ను పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది సినిమా… ఓవరాల్ గా సినిమా వీకెండ్ బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగానే ఉండటంతో టోటల్ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here