Home గాసిప్స్ వరుణ్ తేజ్ నుండి రామ్ కి…ఇప్పుడు రవితేజ….ఫైనల్ ఎవరు??

వరుణ్ తేజ్ నుండి రామ్ కి…ఇప్పుడు రవితేజ….ఫైనల్ ఎవరు??

0

ఒక సినిమా ఒకరి నుండి ఒకరికి వెళ్ళడం అన్నది సర్వ సాదారణంగా జరుగుతూ వస్తుందే… ఒక కథను అనుకుని దానికి సెట్ అయ్యే హీరోని వెతుక్కుని చివరికి సినిమా కన్ఫాం చేస్తారు.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన కొత్త సినిమాలు ఏవి రిలీజ్ లేవు కాబట్టి చాలా మంది డైరెక్టర్స్ తమ అప్ కమింగ్ మూవీస్ కి స్టోరీస్ ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవితో….

సైరా లాంటి పాన్ ఇండియా మూవీ తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన అప్ కమింగ్ మూవీ ని ఇప్పటి వరకు కన్ఫాం చేయలేదు.. కాగా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పటి వరకు ముగ్గురు హీరోలను కలిసిన సురేందర్ రెడ్డి కథలను వినిపించారు.

ముందుగా వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించగా ఎందుకనో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.. కానీ ఇంకా మాటలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయం లో రామ్ కి కూడా ఒక కథని వినిపించిన సురేందర్ రెడ్డి ఇంకా సినిమా ను ఫైనల్ చేయాల్సి ఉండగా లేటెస్ట్ గా ఇప్పుడు…

రవితేజ కి కూడా ఒక కథని వినిపించినట్లు సమాచారం…కిక్ సిరీస్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది… ముగ్గురికి ఒకే కథ వినిపించారా…లేక వేరు వేరు కథలను వినిపించారా అన్నది తెలియాల్సి ఉండగా ముగ్గుర్లో ఎవరు ఫైనల్ అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉందని సమాచారం… లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే రవితేజ కథని ఓకే చేసినా కానీ…

ముందు రామ్ తో సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రెడ్ సినిమాను కంప్లీట్ చేసి రామ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఇటు రవితేజ అటు వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. సో రామ్ మూవీ ముందు కన్ఫామ్ అవ్వొచ్చు అంటున్నారు. మరి ఇందులో ఏది ఫైనల్ గా సెట్ అవుతుందో కొన్ని రోజుల్లో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here