Home న్యూస్ వరుణ్ సందేశ్ ‘నింద’ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

వరుణ్ సందేశ్ ‘నింద’ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం లాంటి మంచి విజయాలతో టాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా అవకాశాలను సొంతం చేసుకున్నా కూడా అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను అందుకోలేక కెరీర్ లో పూర్తిగా స్లో అయిన వరుణ్ సందేశ్(Varun Sandesh) కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నింద(Ninda Movie Review) తో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు…

మరి ఈ సినిమాతో ఎంతవరకు ఆడియన్స్ ను అలరించాడో తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ కి వస్తే….కాండ్రకోట అనే ఊరిలో ఒక అమ్మాయి హత్య జరుగుతుంది…ఆ హత్య చేసింది మరొకరు అయినా ఆ నింద ఒకరి మీద పడుతుంది. ఈ నిజం తెలిసినా కూడా కోర్టు జర్జ్ అయిన తనికెళ్ళ భరణి తీర్పు మార్చలేక పోతాడు…దాంతో తన మానసికంగా వీక్ అయిపోగా…

తర్వాత తన కొడుకు అయిన హీరో వరుణ్ సందేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) అధికారి అవ్వడంతో ఈ కేసుని టేక్ అప్ చేస్తాడు…ఆ తర్వాత కథలో ఎలాంటి ట్విస్ట్ లు టర్న్ లు వచ్చాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. పెర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ సందేశ్ పర్వాలేదు అనిపించేలా నటించగా తన ఎంట్రీ సినిమాలో చాలా ఆలస్యంగా వస్తుంది….

కానీ తను వచ్చిన తర్వాత కథ పర్వాలేదు అనిపించేలా సాగగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా నీరసంగా ఉంటాయి, కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా చాలా వరకు కథ నత్తనడకన సాగి ఆడియన్స్ కి బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. కథ పాయింట్ వరకు బాగానే ఉన్నా కూడా డీల్ చేసిన విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో చూడటానికి ఓపిక చాలా అవసరం…

సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది, డైరెక్టర్ పాయింట్ ను బాగానే రాసుకున్నా చెప్పే విధానంలో మాత్రం తడబడ్డాడు… దాంతో సినిమా చూడాలి అని వెళ్ళే ఆడియన్స్ కి చాలా ఓపిక పట్టి చూస్తె వరుణ్ సందేశ్ పర్వాలేదు అనిపించినా ఓవరాల్ మూవీ మాత్రం యావరేజ్ రేంజ్ లో ఉంటుంది… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here