Home న్యూస్ వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ…రేటింగ్!!

వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ…రేటింగ్!!

0

SR కళ్యాణ మండపంతో మంచి హిట్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం తర్వాత వరుస పెట్టి సినిమా ఛాన్సులను సొంతం చేసుకున్నా కానీ అవేవి కూడా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో అలరించలేదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్2 లో కిరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను టీం బాగా ప్రమోట్ చేయగా టీసర్ ట్రైలర్ ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలను పెంచగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

తిరుపతిలో పుట్టిన హీరో హైదరాబాదులో సెంట్రల్ లైబ్రరీలో పని చేస్తూ ఉండగా యూట్యూబర్ అయిన హీరోయిన్ ని నంబర్ నైబర్ కాన్సెప్ట్ తో కలుసుకుని తర్వాత తనతో ప్రేమలో పడతాడు. అదే టైంలో మురళీకృష్ణ కూడా పరిచయం అవుతాడు… తర్వాత అనుకోకుండా హీరోయిన్ చేతిలో మురళీకృష్ణ చనిపోతాడు…. ఈ ట్విస్ట్ తర్వాత ఏం జరిగింది, దీనికి రీజన్ ఏంటి… హీరో తర్వాత ఏం చేశాడు అన్న ఆసక్తి కరమైన విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సింపుల్ గా మొదలై ఎంటర్ టైన్ మెంట్ తో అలరించి షాకింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకెండ్ ఆఫ్ ఆ మిస్టరీ చిట్టూ కథ కొంచం పడుతూ లేస్తూ సాగి ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకుని మంచి మెసేజ్ తో ముగుసి అనేక జానర్స్ ని టచ్ చేసిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా మంచి సినిమానే చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి ఆడియన్స్ వచ్చేలా ఇంప్రెస్ చేసింది వినరో భాగ్యము విష్ణుకథ సినిమా….

కిరణ్ అబ్బవరం మరోసారి ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేశాడు, హీరోయిన్ పర్వాలేదు, మురళీకృష్ణ రోల్ ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ కి స్కోప్ తక్కువ, సాంగ్స్ పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్,స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ లో కొంచం నీరసంగా సాగింది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…చాలా జానర్స్ ని మిక్స్ చేసిన డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ లో కొంత పార్ట్ వరకు స్లో అయినట్లు అనిపించడం, అక్కడక్కడా కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా అనిపించకపోవడం లాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ…

ఓవరాల్ గా ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్ తో ఆకట్టుకోవడం, విలన్ కే హీరో తన కథని డిఫెరెంట్ గా చెప్పడం, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లు మెప్పించడంతో ఓవరాల్ గా వినరో భాగ్యము విష్ణుకథ బాగానే ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. దానికి తోడూ ఎండ్ టైం లో సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు….  కిరణ్ అబ్బవరంకి SR కళ్యాణ మండపం తర్వాత ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు… ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సినిమా అయ్యాక సాటిస్ ఫై గానే థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here