యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పెద్దగా సక్సెస్ లు లేవు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయాయి. ఇలాంటి టైంలో తన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ మీద భారీ అంచనాలు పెట్టుకున్న ఈ హీరోకి సినిమా మొత్తం మీద…
మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి దక్కేలా చేస్తూ ఉండగా సినిమా మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వగా పోటిలో ఉన్న సార్ మూవీ రెండో రోజు కూడా సూపర్ డామినేషన్ చేస్తూ ఉండగా వినరో భాగ్యము విష్ణు కథ కూడా ఉన్నంతలో…
మంచి జోరునే చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది.. సినిమా ఓవరాల్ గా కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి. ట్రాక్ చేసిన సెంటర్స్ రిపోర్ట్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు….
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 70-80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు ముందుకు వెళతాయో లేక ఇదే విధంగా ఉంటాయో చూడాలి. టాక్ డీసెంట్ గానే ఉండటంతో లాంగ్ రన్ ని సినిమా దక్కించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.