బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోల్లో కోలివుడ్ హీరో చియాన్ విక్రం(Chiyaan Vikram) ఒకరు…పోన్నియన్ సెల్వన్ సిరీస్ తో మంచి జోరు చూపించినా అందులో స్టార్ కాస్ట్ ఎక్కువ ఉండటంతో క్రెడిట్ అందరికీ వెళ్ళింది. కానీ విక్రమ్ కి మంచి పేరు సొంతం అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…
విక్రం హీరోగా రూపొందుతున్న వీర ధీర శూర(Veera Dheera Soora Part 2) మూవీ ఈ నెల 27న తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…ఆల్ రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలే పెంచింది అని చెప్పాలి.
సినిమా కూడా ట్రైలర్ రేంజ్ లో మెప్పిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రమ్ చాలా టైం తర్వాత కమర్షియల్ సక్సెస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది…ఇక సినిమా తెలుగు రైట్స్ కి మరీ అద్బుతం కాదు కానీ ఈ వీక్ ఎండ్ లో ఉన్న పోటి ని తట్టుకుని డీసెంట్ బిజినెస్ ను…
ఇప్పుడు సొంతం చేసుకుంది ఈ సినిమా…ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల రేంజ్ లో సొంతం అయినట్లు సమాచారం. ఇక సినిమా తెలుగు లో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొత్తం మీద వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియాల్సి ఉండగా…ఓవరాల్ గా లెక్కలు 45 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండొచ్చు అని అంచనా…ఫైనల్ లెక్కలు త్వరలో తెలనుండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వీర ధీర శూర సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.