బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా సోలో హీరోగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన చియాన్ విక్రం(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర(Veera Dheera Soora Part 2) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చేసింది. కొన్ని అవరోధాలను ఎదురుకున్నా కూడా ఎలాగోలా రిలీజ్ అయిన ఈ సినిమా…
ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…ఓ ఇద్దరినీ ఎన్ కౌంటర్ చేయాలనీ డిసైడ్ అయిన ఎస్పీ ఎస్ జే సూర్య పక్కా ప్లానింగ్ తో ఉండగా…ఎస్ జే సూర్యనే చంపడానికి హీరోని రంగం లోకి దింపుతారు…
ఒక్క రాత్రిలో వీళ్ళ మధ్య పోటిలో ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ….చాలా బేసిక్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన వీర ధీర శూర కొంచం ఖైదీ మూవీని తలపించినా కూడా ఎక్కడా బోర్ అనేది లేకుండా డిఫెరెంట్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ తో ఆకట్టుకుంది…
విక్రమ్ చాలా టైం తర్వాత పక్కా మాస్ రోల్ లో అదరగొట్టేశాడు…తన ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సినిమా లో చూపించగా అదంతా సినిమా ప్రీక్వెల్ కోసం దాచిపెట్టారు… ఈ పార్ట్ లో తన రోల్ వరకు విక్రమ్ ఫుల్ ఫామ్ లో దుమ్ము దులిపేశాడు అనే చెప్పాలి.
ఇక ఎస్ జే సూర్య మరోసారి తనదైన విలనిజం తో మెప్పించగా…ఇద్దరి మధ్య సీన్స్ బాగా వచ్చాయి. ఇక మిగిలిన రోల్స్ పర్వాలేదు అనిపించగా…చాలా వరకు నైట్ లోనే షూటింగ్ జరగగా సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా స్క్రీన్ ప్లే చాలా వరకు బోర్ ఏమి అనిపించలేదు…
కానీ కొన్ని సీన్స్ లాగ్ అయినట్లు అనిపించడం, అక్కడక్కడా తర్వాత సీన్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం మరియు కొంచం డ్రాగ్ అయిన ఫీలింగ్ లాంటివి కలగడం లాంటివి మైనస్ పాయింట్స్ అయినా కూడా విక్రమ్ సూర్యల పెర్ఫార్మెన్స్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ల వలన…
సినిమా పెద్దగా బోర్ ఏమి అనిపించలేదు…ఓవరాల్ గా రీసెంట్ టైంలో విక్రమ్ సోలో హీరోగా చేసిన సినిమాల కన్నా కూడా చాలా బెటర్ గా అనిపించిన వీర ధీర శూర ఓవరాల్ గా విక్రమ్ కి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి….పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా…
థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా మెప్పించిన వీర ధీర శూర రీసెంట్ టైంలో విక్రమ్ మూవీస్ లో బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు… కథ విషయంలో మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా రేంజ్ ఇంకో లెవల్ లో ఉండేది. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….