నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయింది, ఇక సినిమా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ షోల నుండి సినిమాకి ఎలాంటి టాక్ లభించింది సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
రాయలసీమ లీడర్ అయిన వీర సింహా రెడ్డికి తన చెల్లెలు వరలక్ష్మీ ఎదురు తిరిగి విలన్ గా మారుతుంది, వీర సింహా రెడ్డి కొడుకు ఇస్తాంబుల్ లో ఉంటాడు, కొడుకు తనకు ఇష్టమైన అమ్మాయి శృతి హాసన్ ను పెళ్లి చేసుకుంటూ ఉండటంతో ఊరి నుండి తండ్రి వస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వీర సింహా రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
టీం ముందు నుండే చెప్పినట్లు ఇది రొటీన్ మూవీ, చాలా సార్లు చూసిన రొటీన్ కథతోనే తెరకెక్కిన ఊరమాస్ మూవీ, ఇది గుర్తు పెట్టుకుని థియేటర్స్ లో జనాలు అడుగు పెడితే, కొంచం లెంత్ ని తట్టుకుంటే సినిమా ఒకసారి ఈజీగా చూసేలా ఉంటుంది అనడంలో సందేహం లేదు…. కానీ ఓవరాల్ గా లెంత్ ఈ సినిమా కి మేజర్ మైనస్ పాయింట్…..
ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి ఓ 20 నిమిషాల టైం పట్టినా పెద్ద బాలయ్య ఎంటర్ అయిన తర్వాత ఊపు అందుకుని ఇంటర్వెల్ వరకు బాగా ఆకట్టుకుని ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పుస్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చేలా ఉంటుంది, ఇక సెకెండ్ ఆఫ్ మాత్రం కొంచం సెంటిమెంట్ డోస్ పెంచుతూ లాగ్ మీద లాగ్ లాగే సాగే స్క్రీన్ ప్లే ఆ తర్వాత వచ్చే రొటీన్ క్లైమాక్స్ ల వలన ఫస్టాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేక పోతుంది…
పెర్ఫార్మెన్స్ పరంగా బాలయ్య మరోసారి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపగా తన లుక్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఫ్యాన్స్ కి కచ్చితంగా పూనకాలు తెప్పించడం ఖాయం, ముఖ్యంగా ఫైట్ సీన్స్ అయితే ఎక్స్ లెంట్ గా వచ్చాయి, అందులో కూడా కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ కి ఇవి బాగా నచ్చే అవకాశం ఉంది. శృతి హాసన్ పాటలకే పరిమితం అవ్వగా వరలక్ష్మీ రోల్ కొంచం ఓవర్ గా అనిపించినా పర్వాలేదు… మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపిస్తారు… ఇక విలన్ గా దునియ విజయ్ నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తే జస్ట్ ఓకే అనిపించుకున్నాడు…
తమన్ పాటలు బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ అఖండ రేంజ్ లో కాకున్నా అదరగొట్టేశాడు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సినిమా కథకి తగ్గట్లు స్లోగా సాగుతుంది, సినిమాను ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంది… సెకెండ్ ఆఫ్ లెంత్ తగ్గిస్తే కామన్ ఆడియన్స్ కి కొంచం బెటర్… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే గోపీచంద్ మలినేని ఫస్టాఫ్ వరకు మరోసారి క్రాక్ మ్యాజిక్ ని…
మళ్ళీ రిపీట్ చేసేలానే అనిపించినా సెకెండ్ ఆఫ్ మరీ రొటీన్ ఫార్మాట్ లో వెళ్ళడంతో అది ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి కొంచం రొటీన్ అయినా పర్వాలేదు అనిపించవచ్చు కానీ రెగ్యులర్ ఆడియన్స్ ఓపికతో చూడక తప్పని పరిస్థితి… సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ బ్లాక్స్ కూడా ఎక్కువగానే ఉన్నా ఫస్టాఫ్ లో ఉన్నంత కిక్ ఇచ్చే విధంగా అయితే లేవు…. ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ పై ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది…
మొత్తం మీద వీర సింహా రెడ్డి ఒక రొటీన్ మాస్ మూవీ, ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి బాగుంది అనిపించవచ్చు కానీ రెగ్యులర్ ఆడియన్స్ ఫస్టాఫ్ నచ్చినా సెకెండ్ కొంచం ఓపికతో చూస్తె సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. టీసర్ ట్రైలర్ ల తర్వాత మరీ ఓవర్ ఎక్స్ పెర్టేషన్స్ తో వెళ్ళకుండా నార్మల్ గా ముందే చెప్పినట్లు ఇది రెగ్యులర్ మాస్ మూవీ అని గమనించి థియేటర్స్ కి వెళ్లి లెంత్ ని తట్టుకోగలిగితే మరీ అఖండ రేంజ్ లో కాకున్నా అంతకన్నా ముందు బాలయ్య మూవీస్ కన్నా కూడా బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా… సినిమా కి ఓవరాల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్…