బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ నెల కలిసి రాదు అంటారు కానీ ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన సినిమాల్లో అటు వెంకి మామ ఇటు ప్రతీ రోజూ పండగే సినిమాలు దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్నాయి. ముఖ్యంగా రెండు సినిమాలు ఫ్యామిలీ మూవీస్ కాగా రెండింటికి మరీ అద్బుతమైన టాక్ రాక పోయినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతున్నాయి.
ఇక క్రిస్టమస్ హాలిడే ని ఎంజాయ్ చేసిన ఈ సినిమా లు ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ ని గమనిస్తే… వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజున కూడా సాలిడ్ గా హోల్డ్ చేసింది, సినిమా 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల నుండి 50 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక బాలయ్య రూలర్ పరిస్థితి మరింత క్షీణించి డిసాస్టర్ కి తగ్గేలా లేదు, సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ టార్గెట్ ని అందుకునేలా లేవు, ఇక 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓపెనింగ్స్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి. మొత్తం మీద ఈ రోజు రూలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు…. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క తగ్గడమో పెరగడమో జరుగుతుంది, ఇక ప్రతీ రోజూ పండగే 6 వ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకోగా 7 వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. సినిమా 7 వ రోజు కలెక్షన్స్ తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. మొత్తం మీద 7 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. వీటికి తోడూ కొత్త రిలీజ్ మత్తు వదలరా ఈ రోజు దుమ్ము లేపి అంచనాలను మించనుంది, ఈ సినిమా 35 నుండి 40 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చని టాక్. ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.