Home న్యూస్ రజినీ కోసం సూర్య బిగ్గెస్ట్ త్యాగం…ఓపెన్ గానే విషయం చెప్పేశాడుగా!!

రజినీ కోసం సూర్య బిగ్గెస్ట్ త్యాగం…ఓపెన్ గానే విషయం చెప్పేశాడుగా!!

0

కోలివుడ్ లో ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో క్రేజీ మూవీస్ కొన్ని ఉండగా త్వరలో ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీస్ లో అక్టోబర్ 10న భారీ అంచనాల నడుమ సూర్య(Suriya) నటించిన కంగువ(Kanguva Movie) పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ ను కన్ఫాం చేశారు….ప్రమోషన్స్ కూడా సాలిడ్ గా జరపగా…

సడెన్ గా ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దానికి కారణం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajnikanth) నటించిన బిగ్ మూవీ వేటయ్య మూవీ ని అక్టోబర్ 10న అనౌన్స్ చేశారు. దాంతో రజినీ సూర్య సినిమాల మధ్య పోటి కన్ఫాం అయ్యింది…

దాంతో పోటిలో ఎవరి సినిమా ఇబ్బందులను ఫేస్ చేస్తుందో అందరూ అనుకుంటూ ఉండగా సూర్య తన సినిమాను పోస్ట్ పోన్ చేశాడు, దీపావళి కి అనుకున్నా రిలీజ్ కష్టంగానే ఉండగా నవంబర్ 15 టైంలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటూ ఉండగా, రిలీజ్ డేట్ ను చెప్పకున్నా కూడా…

రీసెంట్ గా ఈ విషయం పై మీడియాతో మాట్లాడాడు సూర్య…అక్టోబర్ 10 న వేటయ్య సినిమానే వస్తుందని, ఆ సినిమాకి మనం దారి ఇచ్చి తీరాలి, ఎందుకంటే అది రజినీ సినిమా..ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన సినిమాకి పోటి రావడం ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేశాడు సూర్య…

ఈ స్పీచ్ కి ప్రతీ ఒక్కరు సూర్యని మెచ్చుకుంటున్నారు….వేటయ్య మూవీని ఈ ఇయర్ మొదట్లోనే అక్టోబర్ రిలీజ్ అని చెప్పారు కానీ డేట్ చెప్పలేదు, డేట్ చెప్పకపోవడం వలన కంగువ మూవీని ఆ డేట్ కి కన్ఫాం చేశారు….కానీ ఇప్పుడు వేటయ్య ఆ డేట్ కి కన్ఫాం అవ్వడంతో..

ఓపెన్ గా సూర్య రజినీకాంత్ సినిమాకి ఎవరైనా దారి ఇచ్చి తీరాల్సిందే అంటూ చెప్పడంతో తన వ్యక్తిత్వం మరింతగా పెరిగేలా చేసిందని మెచ్చుకుంటున్నారు. ఇక కంగువ సినిమాతో సూర్య, వేటయ్య సినిమాతో రజినీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here