కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) తిరుగు లేని కంబ్యాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 606 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసిన ఆ సినిమా విజయం తర్వాత…
రజినీకాంత్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ అయిన వేటయ్య(Vetayya Movie) మూవీ మీద మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు అక్టోబర్ 10 న సూర్య(Suriya) కంగువ(Kanguva) కి పోటిగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…
తెలుగులో బిజినెస్ పరంగా ఆల్ రెడీ మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది…కాగా రీసెంట్ గా సినిమాకి తెలుగు రాష్ట్రాలు టోటల్ గా కలిపి 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది…ఆ టైంలో పోటిలో ఉన్న సూర్య కంగువకి…
కూడా సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా సడెన్ గా పోటిలోకి ఎంటర్ అయినా కూడా రజినీ ఆల్ రెడీ 606 కోట్లను జైలర్ తో అందుకోవడం, ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవడంతో ఈ సినిమా మీద హైప్ ఉండటం కామన్…
కానీ మరీ భీభత్సమైన బిజినెస్ ఆఫర్స్ రాకున్నా ఆల్ మోస్ట్ 16 కోట్ల రేంజ్ లో ఆల్ మోస్ట్ ఫైనల్ అయినా రేటు 18 కోట్ల దాకా ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది….ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయిన వేటయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపించినా….
సూర్య కంగువకి దెబ్బ పడే అవకాశం ఎంతైనా ఉంది, ఆ సినిమా ఎంత హైప్ ఉన్నా పక్కా కమర్షియల్ మూవీ కి టాక్ సరిగ్గా వస్తే ఆ ఊపు మరో రేంజ్ లో ఉంటుంది. మరి భారీ క్లాష్ లో సూపర్ స్టార్ రజినీ మరోసారి జైలర్ ను మరిపించే రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.