మొదటి రోజు మిక్సుడ్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie 4th day Collections) సినిమా దసరా వీకెండ్ లో సాలిడ్ గానే కుమ్మేస్తుంది. మూడో రోజు ఓవరాల్ గా అన్ని చోట్లా కుమ్మేసిన వేట్టయన్ మూవీ…
4వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతున్న సినిమా తమిళ్ లో మరోసారి ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది ఇప్పుడు.
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4వ రోజు మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 1.8-2 కోట్ల వైపుకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇక తమిళనాడులో బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా ఇప్పుడు 8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఓవర్సీస్ లో కూడా 1.2-1.5 మిలియన్ డాలర్స్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 40-42 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు అంచనాలను మించిపోతే,…
ఈ అంచనాలను కూడా మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా కి మొదటి రోజు కొంచం టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 4 రోజులను పూర్తి చేసుకోబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో ఇలానే హోల్డ్ చేస్తే టార్గెట్ కి దగ్గరగా వెళ్ళే ఛాన్స్ ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.