లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailar Movie) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఆ సినిమా తో అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఏకంగా 606 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…ఇప్పుడు జైలర్ మూవీ తో పోల్చితే ఆ రేంజ్ లో బజ్ ను…
సొంతం చేసుకోలేక పోయిన రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్(Vettaiyan Movie) ఆడియో పరంగా మంచి బజ్ ను సొంతం చేసుకున్నా కూడా ట్రైలర్ సీరియర్ గా ఉండటం, జైలర్ రేంజ్ తో పోల్చితే జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉండటంతో….
సినిమా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసి మూడు రోజులు కావోస్తూ ఉండగా జైలర్ రేంజ్ లో బజ్ లేక పోవడంతో ఆ రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ కనిపించకున్నా కూడా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో…
ఓవర్సీస్ లో 1.8 మిలియన్ డాలర్స్ కి పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇండియన్ కరెన్సీలో 15 కోట్లకు పైగా బుకింగ్స్ ను అందుకోగా….సినిమా ఇక తమిళనాడులో కూడా జైలర్ తో పోల్చితే బుకింగ్స్ ట్రెండ్ కొంచం స్లో గా ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా బుకింగ్స్…
పర్వాలేదు అనిపించేలా ఉండగా ఇండియన్ గ్రాస్ బుకింగ్స్ ఇప్పటి వరకు 15 కోట్ల మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా మొదటి రోజుకి గాను వరల్డ్ వైడ్ బుకింగ్స్ 30 కోట్ల మార్క్ ని దాటేయగా…వీకెండ్ కి గాను బుకింగ్స్ ట్రెండ్ 38 కోట్ల రేంజ్ లో ఉన్నాయి…
దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే తొలిరోజు మంచి ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే 60 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…..ఓవరాల్ గా టాక్ బాగుంటే బజ్ పెద్దగా లేక పోయినా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.