తెలుగు రాష్ట్రాలలో తన మార్కెట్ ని అంచలంచలుగా పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్… రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సంక్రాంతి మూవీ మాస్టర్ తెలుగు లో విజయ్ కెరీర్ లో అన్ని రికార్డులను బ్రేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, ఇక ఈ ఊపులో విజయ్ నటించిన ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా తెలుగు లో వన్ బై వన్…
డబ్ అయ్యి టెలికాస్ట్ కాని సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇలా ఓల్డ్ మూవీస్ చాలానే రాగా, రీసెంట్ టైం లో విజయ్ మూవీస్ లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా…
భైరవ తెలుగు డబ్బింగ్ ఏజెంట్ భైరవా బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 లోనే తెలుగు లో కూడా రిలీజ్ అయినా జస్ట్ ఒక నిపించుకుంది, తమిళ్ లో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు. దాంతో అప్పటి నుండి సినిమా తెలుగు లో టెలికాస్ట్ అవ్వలేదు.
కానీ రీసెంట్ విజయ్ క్రేజ్ చూసి ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ 55 లక్షల రేటు చెల్లించి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో డీసెంట్ ప్రమోషన్స్ చేసిన తర్వాత టెలికాస్ట్ చేశారు, మహానటి ఫేం కీర్తి సురేష్ కూడా ఉండటం మరింత బోనస్ అవ్వగా ఫస్ట్ టైం సినిమా ఇక్కడ టెలికాస్ట్ అయినప్పుడు 4.96 TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది…
ఇది మరీ అద్బుతం కాదు కానీ ఓల్డ్ మూవీ కి ఈ రేంజ్ రేటింగ్ అద్బుతం అనే చెప్పాలి, అదే టైం లో అనుష్క కొత్త సినిమా నిశబ్దం ప్రీమియర్ అవ్వగా కేవలం 3.9 రేటింగ్ నే సొంతం చేసుకుంది. కొత్త సినిమా సాధించలేని రేటింగ్ ను డబ్బింగ్ మూవీ సాధించింది. విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నింటికీ అదిరిపోయే రేటింగ్స్ దక్కాయి.. ఫ్యూచర్ మూవీస్ కి క్రేజ్ మరింత పెరిగి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..