Home న్యూస్ డిసాస్టర్ సినిమాతో ఈ రాంపేజ్ ఏంటి సామి…హిందీ లో ఊరమాస్ రికార్డ్!

డిసాస్టర్ సినిమాతో ఈ రాంపేజ్ ఏంటి సామి…హిందీ లో ఊరమాస్ రికార్డ్!

674
0

కొన్ని కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమాలు బుల్లి తెర పై అద్బుతాలు సృష్టిస్తూ ఉంటాయి, అలాగే హిందీ డబ్బింగ్ లో కూడా ఎవ్వరూ అంచనా వేయాలని అద్బుతాలు అప్పుడప్పుడు నమోదు అవుతాయి. లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందు కోలేక డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న ఓ సినిమా ఇప్పుడు హిందీ డబ్బింగ్ మూవీస్ లో…

ఏ సినిమా కూడా సాధించని రేర్ రికార్డ్ ఫీట్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది,  ఆ సినిమానే విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల నడుమ వచ్చి ఫ్లాఫ్ అయిన డియర్ కామ్రేడ్ మూవీ.

ఈ సినిమా ఇక్కడ డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నా హిందీ డబ్ మూవీస్ పరంగా ఏ సినిమా సాధించని మెంటల్ మాస్ రికార్డ్ ను నమోదు చేసింది. కొన్ని సినిమాలు 250 – 300 రేంజ్ మిలియన్ వ్యూస్ అందుకున్నవి కూడా సాధించని విధంగా… డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం…

160 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని ఏకంగా 2 మిలియన్స్ లైక్స్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. హిందీ డబ్బింగ్ మూవీస్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ ఫీట్ ని అందుకోలేదంట… దాంతో ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా డియర్ కామ్రేడ్ హిందీ డబ్ వర్షన్ సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేసింది.

విజయ్ దేవరకొండ కి నార్త్ లో కూడా సాలిడ్ గా క్రేజ్ పెరుగుతూ పోతుండటం విశేషం అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ని భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా క్లిక్ అయితే ఇక రచ్చ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here