Home న్యూస్ 8M**…సౌత్ నం1….విజయ్ దేవరకొండ ఊరమాస్!!

8M**…సౌత్ నం1….విజయ్ దేవరకొండ ఊరమాస్!!

552
0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కి యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది…అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ పడ్డా కానీ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గడం లేదు. తన అప్ కమింగ్ అయిన ఫైటర్ పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. పూరీ జగన్నాథ్ రీసెంట్ లో ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇక తన క్రేజ్ కి మరో నిదర్శనం….

సోషల్ మీడియా లో తన ఫాలోయింగ్ అని చెప్పాలి. సెలెబ్రిటీలు ట్విట్టర్ కన్నా కూడా ఎక్కువ ప్రిఫర్ చేసే ప్లాట్ ఫాం ఇన్ స్ట గ్రామ్…టాలీవుడ్ హేమా హేమీలు ఎంతమంది ఉన్నా అక్కడ కుర్ర హీరో అయిన విజయ్ దేవరకొండ అందరినీ దాటేసి అక్కడ టాప్ ప్లేస్ ని దక్కించుకున్నాడు.

అక్కడ తన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందీ అంటే ఏకంగా 8 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండియా లో ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి హీరో విజయ్ దేవరకొండ అవ్వడం మరో విశేషం అని చెప్పాలి. ఒకసారి ఇన్ స్ట గ్రామ్ లో….

హైయెస్ట్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 తెలుగు హీరోలను ఒకసారి గమనిస్తే..
👉#VijayDevarakonda – 8M
👉#AlluArjun – 7.64M
👉#MaheshBabu – 5.27M
👉#Prabhas – 4.81M
👉#RanaDaggubati – 4.03M
👉#RamCharan – 2.63M
👉#Nani – 2.61M
👉#VarunTej – 1.88M
👉#NTR – 1.87M
👉#Ram – 1.86M
విజయ్ దేవరకొండ వెనకనే అల్లు అర్జున్ టాప్ ప్లేస్ కి సొంతం చేసుకోవడానికి దూసుకువస్తున్నాడు కానీ…

ఓ యంగ్ హీరో అక్కడ ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని ప్రస్తుత స్టార్ హీరోలను అందరినీ దాటేసి ఫాలోవర్స్ లో నంబర్ 1 గా నిలవడం అన్నది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఇక తన అప్ కమింగ్ మూవీ ఫైటర్ అంచనాలను అందుకుంటే పాన్ ఇండియా లెవల్ లో విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం పుష్పలంగా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here