యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ యమ జోరు మీదున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ లేకున్నా కానీ తన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గక పోవడం తో కొత్త సినిమాల కమిట్ మెంట్స్ తో దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత బాలీవుడ్ మూవీ చేసే అవకాశం ఉండగా…
లేటెస్ట్ గా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ని కమిట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు…. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ డైరెక్షన్ లో కొత్త సినిమా కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ, ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తుండగా…
ఈ సినిమా వచ్చే ఏడాది రానుండగా సినిమా పూర్తీ అయిన తర్వాత సినిమా ను విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుండగా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. కొత్త నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై…
కేదార్ సెలగం శెట్టి నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. టైర్ 2 హీరోలలో టాప్ ప్లేస్ కోసం పోటి పడుతున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు, కానీ తన మార్కెట్ రేంజ్ ని అమాంతం పెంచిన సినిమా గీత గోవిందం టాప్ హీరోల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోగా… అలాంటి సినిమాలు మరో రెండు మూడు పడితే…
స్టార్ హీరోల లీగ్ కి వెళ్ళే అవకాశం ఉండగా, లేటెస్ట్ మూవీ నిరాశ పరచినా ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో దుమ్ము లేపుతున్న విజయ్ కి పూరీ జగన్నాథ్ మూవీ అలాగే ఆ సినిమా ను మించి సుకుమార్ మూవీ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయితే కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ తో పాటు స్టార్ హీరోల లీగ్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.