పెద్దగా హైప్ లేని మూవీ….ఆడియో ఫ్లాఫ్….రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్….వేరే ఎవరైనా అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా రిజల్ట్ చాలా నిరాశ కలిగించేలా ఉండేది, కానీ కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా మాత్రం…
ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ రీసెంట్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసి రచ్చ చేయగా, సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో సొంతం చేసుకోగా…
ఇదంతా వీకెండ్ వరకే అనుకుంటే సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత కూడా తమిళనాడు మరియు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు మిక్సుడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఇక సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది….విజయ్ కి తమిళనాడుకి మించి ఓవర్సీస్ లో సెన్సేషనల్ మార్కెట్ ఉండగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా 55 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది…
ఇక సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లో ఆల్ మోస్ట్ 127 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా అందులో నుండి షేర్ ఆల్ మోస్ట్ 57.50 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా ఓవరాల్ గా ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది ఓవర్సీస్ లో…
చాలా వరకు మిక్సుడ్ టాక్ వస్తే ఓవర్సీస్ లో కూడా హెవీ డ్రాప్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.