కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 13 న రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై అంచనాలు మరో లెవల్ లో ఉండటం తో తమిళ్ లో సినిమా కి ఆల్ టైం రికార్డ్ లెవల్ ఓపెనింగ్స్ ఖాయమని అక్కడ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు లో పోటి తీవ్రంగా ఉంటడంతో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా చాలా దేశాల్లో పరిస్థితులు ఇంకా సద్దుకోక పోవడంతో మాస్టర్ రిలీజ్ నార్మల్ గా ఉంటుందా లేదా ఉండదా అన్న డౌట్ ఉండగా సినిమా ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ…
ఓవర్సీస్ లో కూడా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా అమెరికాలో మొత్తం మీద 105 లోకేషన్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా ఆస్ట్రేలియాలో 80 లోకేషన్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ లో కూడా 70 వరకు లోకేషన్స్ లో…
రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న సినిమా టోటల్ గా ఈ మూడు చోట్లే కలిపి 250 లోకేషన్స్ లో మినిమం 250 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇంకా మలేషియా యు కే మరియు UAE లాంటి దేశాల్లో కూడా సినిమా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక తమిళనాడు లో కూడా థియేటర్స్ లో ఆక్యుపెన్సీ ని 50% నుండి 100% కి పెంచుకుని నార్మల్ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో తమిళ్ లో సినిమా రికార్డ్ లెవల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి మాస్టర్ తో విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.