Home గాసిప్స్ మాస్టర్ కి 130 కోట్లు….ఇండియా మొత్తం షాక్!!

మాస్టర్ కి 130 కోట్లు….ఇండియా మొత్తం షాక్!!

0

     రీసెంట్ టైం లో సౌత్ లో ఒకటి తర్వాత ఒకటి నాన్ స్టాప్ హిట్స్ తో ఫుల్ జోరు మీదున్న హీరో కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్… మెర్సల్, సర్కార్, బిగిల్ ఇలా వరుస 200 కోట్ల సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ ని సినిమా సినిమా కి మరింత పెంచుకుంటూ దూసుకు పోతున్న విజయ్ నటిస్తున్న సరికొత్త సినిమా మాస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

రీసెంట్ గా కార్తీ కి ఖైదీ తో కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ఆడియన్స్ ముందుకు రావాల్సింది. ఏప్రిల్ 9 న రిలీజ్ డేట్ అనుకున్న ఈ సినిమా లాక్ డౌన్ వలన పోస్ట్ పోన్ అయింది.

ఇంతలో అన్ని ఇండస్ట్రీ లలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి స్ట్రీమింగ్ యాప్స్… సినిమాల రేంజ్ ని బట్టి ఆఫర్స్ భారీ గానే ఇస్తున్నాయి కానీ చాలా కొద్ది సినిమాలు మాత్రమె టెంప్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మాస్టర్ సినిమా బిజినెస్…

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విజయ్ పాత సినిమాల కన్నా ఓ 10-15 కోట్ల తక్కువ బిజినెస్ చేసే అవకాశం ఉంది. అంటే 120 కోట్లకు అటూ ఇటూ గా మినిమమ్ బిజినెస్ చేస్తుంది. కానీ పెద్ద స్ట్రీమింగ్ యాప్స్ ఏకంగా విజయ్ మాస్టర్ సినిమా కి ఇచ్చిన ఆఫర్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉందని చెప్పాలి.

అక్షరాలా 130 కోట్ల రేంజ్ లో ఆఫర్ ని టాప్ స్ట్రీమింగ్ యాప్స్ ఇస్తున్నాయని తెలుస్తుంది, కానీ టీం మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. లాక్ డౌన్ పూర్తీ అయిన తర్వాత జనాలు భారీ సంఖ్యలో థియేటర్స్ రప్పించే సినిమాల్లో మాస్టర్ ఒకటి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ఆఫర్స్ కి ఓకే చెప్పే చాన్స్ లేదని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here