ఒక పెద్ద సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంటే ఆ సినిమా కి సంభందించిన కథలు ఇవే అంటూ సోషల్ మీడియా లో కథలు లీక్ అవ్వడం కామన్ అనే చెప్పాలి. ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన విజయ్ మాస్టర్ విషయం లో మాత్రం సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన కానీ ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్తలు పడ్డారు. కాగా రీసెంట్ గా సినిమా గురించిన….
కథ పాయింట్ ఇదే అంటూ సోషల్ మీడియా లో మెయిన్ కథ పాయింట్ చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది కానీ ఆ కథ పాయింట్ ఏంటి అంటే…. మందుకి బానిస అయిన ఒక యంగ్ ప్రొఫెసర్…. ఉద్యోగ రిత్యా….
ఒక కాలేజ్ కి 3 నెలల టీచింగ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది…. ఆ ఊరిలో పెద్ద దాదా అయిన విలన్ విజయ్ సేతుపతి ఆ కాలేజ్ లో ఉన్న కుర్రాళ్ళతో ఇల్లీగల్ పనులు చేయిస్తూ ఉంటాడు… అలాంటి చోట హీరో లాండ్ అయ్యాక హీరో విలన్ ల మధ్య పోరే మాస్టర్ సినిమా కథ అని అంటున్నారు…
మరి ఈ కథలో ఎంతవరకు నిజం ఉందీ అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది కానీ కథ పాయింట్ మాత్రం చాలా వరకు నాగ చైతన్య మొదటి సినిమా జోష్ ని పోలి ఉందనిపిస్తుంది… అక్కడ నాగచైతన్య స్టూడెంట్ కాగా ఇక్కడ విజయ్ ప్రొఫెసర్ గా చేయబోతున్నారు… ఇది ఒక్కటే తేడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్…
మరో లెవల్ లో తీసే డైరెక్టర్ కాబట్టి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 13 న వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న మాస్టర్ సినిమా తెలుగు లో కూడా సాలిడ్ గా రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలబడుతుందో చూడాలి మరి.