Home గాసిప్స్ విజయ్ మాస్టర్…. ఇక వచ్చేది అప్పుడే…రచ్చ ఖాయం!

విజయ్ మాస్టర్…. ఇక వచ్చేది అప్పుడే…రచ్చ ఖాయం!

0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రతీ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో రీసెంట్ టైం లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫాం లో దూసుకు పోతున్నాడు. కెరీర్ బెస్ట్ ఫేస్ లో ఉన్న విజయ్ నటించిన లేటెస్ట్ మూవీస్ మెర్సల్, సర్కార్ మరియు బిగిల్ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగగ్ర ఒకటి కి మించి ఒకటి విజయాలను నమోదు చేశాయి.

ఇక ఈ సినిమాల తర్వాత విజయ్ చేసిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాని రీసెంట్ గా పరిస్థితులను గమనించి…

ఈ ఇయర్ దీపావళి కి రిలీజ్ చేయాలి అని భావించారు. విజయ్ లాస్ట్ మూవీస్ అన్నీ కూడా దీపావళికే రిలీజ్ అయ్యి అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడం తో ఈ సినిమా కూడా అలానే అదరగొడుతుంది అనుకున్నా ప్రస్తుత పరిస్థితులు ఇంకా ఏమాత్రం సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు…

టీం సినిమా ను ఇక ఈ ఇయర్ లో రిలీజ్ చేయడం కుదరని పని అని డిసైడ్ అయినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటూ ఉండగా ఇయర్ ఎండ్ కి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి అని చెబుతున్న నేపధ్యంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను సంక్రాంతి కి భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట.

సంక్రాంతికి ఇంకా ఏ సినిమా కూడా కమిట్ కాకపోవడం, తెలుగు లో కూడా మీడియం రేంజ్ మూవీస్ మాత్రమె కన్ఫాం అవ్వడం తో సంక్రాంతికి వస్తే దంచికొట్టొచ్చు అన్న భావన లో ఉన్నారట టీం. అప్పటికి పరిస్థితులు పూర్తిగా సద్దుకుంటేనే రిలీజ్ చేస్తారని లేకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here