కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ కోసం టోటల్ సౌత్ ఆడియన్స్ తో పాటు ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రల్లలో బిజినెస్ ను….
పూర్తీ చేసుకుని రిలీజ్ కి సన్నాహాలు మొదలు పెట్టింది. సినిమా కి లాస్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అనుకున్న టైం లో 10 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినప్పటికీ తర్వాత పరిస్థితులు మారిపోగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అండ్ తెలుగు లో ఉన్న పోటి దృశ్యా….
సినిమా కి కొంచం బిజినెస్ తగ్గినా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో టార్గెట్ పెద్దదే అని చెప్పాలి. సినిమా కి నైజాం ఏరియా లో 2 కోట్ల బిజినెస్ జరగగా, టోటల్ ఆంధ్రాలో 4.6 కోట్ల బిజినెస్ జరిగింది… ఇక సీడెడ్ ఏరియాలో సినిమా కి 1.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
దాంతో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్టర్ సినిమా 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కొన్ని ఏరియాలలో సినిమా ఓన్ రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది…. మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది… ప్రస్తుత పరిస్థితులలో ఈ బిజినెస్ టార్గెట్ చాలా పెద్దదే అని చెప్పాలి.
అండ్ తెలుగు సినిమాల పోటి కూడా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో మాస్టర్ సినిమా ఎంతవరకు జోరు చూపి పెట్టిన బిజినెస్ ను రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తి కరం. రీసెంట్ టైం లో సంక్రాంతికి వచ్చిన డబ్బింగ్ మూవీస్ ఏవి సక్సెస్ అవ్వలేదు. మరి మాస్టర్ ఆ పని చేసి చూపుతుందో లేదో చూడాలి.