Home న్యూస్ 2 మిలియన్స్ ఔట్….ఇండియన్ సినిమా చరిత్రలో ఒకే ఒక్కడు…

2 మిలియన్స్ ఔట్….ఇండియన్ సినిమా చరిత్రలో ఒకే ఒక్కడు…

650
0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి సినిమాలకు యూట్యూబ్ లో ఎలాంటి సెన్సేషనల్ రికార్డులు దక్కాయో అందరికీ తెలిసిందే, సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుకోవడమే కాకుండా ఇటు సోషల్ మీడియా రికార్డులతో కూడా దుమ్ము దుమారం చేస్తున్నాడు విజయ్, విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా యూట్యూబ్ లో అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కొత్త రికార్డులను….

నమోదు చేసి సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా ఫాస్టెస్ట్ రికార్డులతో మెంటల్ మాస్ అనిపించే రికార్డులను నమోదు చేస్తూ ఫాస్టెస్ట్ 20 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకోగా…

ఇప్పుడు టీసర్ హిస్టారికల్ 2 మిలియన్స్ లైక్స్ మార్క్ ని అందుకుని మరో రికార్డ్ ను నమోదు చేసింది, ఇండియన్ సినిమా హిస్టరీ లో మొట్ట మొదటి 2 మిలియన్స్ లైక్స్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి టీసర్ గా రికార్డ్ ను సొంతం చేసుకుంది మాస్టర్ సినిమా అఫీషియల్ టీసర్…

ఈ రికార్డును కేవలం ఒకటిన్నర రోజుకి పైగా టైం మాత్రమె తీసుకుని అందుకోవడం మరో విశేషం అనే చెప్పాలి. దాంతో ఈ సినిమా టీసర్ ఇండియా లో మొట్ట మొదటి రికార్డ్ ను అందుకున్న టీసర్ గ నిలవగా ఈ రికార్డ్ సొంతం చేసుకున్న హీరోగా విజయ్ చరిత్ర సృష్టించాడు. సినిమా సినిమా కి కొత్త రికార్డులు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేస్తున్న విజయ్….

2 ఏళ్ల క్రితం చేసిన సర్కార్ సినిమా టీసర్ రికార్డులే ఇంకా సేఫ్ గా ఉండగా ఇప్పుడు మాస్టర్ టీసర్ తో సరికొత్త రికార్డులు నమోదు చేసి అప్ కమింగ్ బిగ్ మూవీ టీసర్ లకు ఊహకందని టార్గెట్ ని సెట్ చేసి పెట్టాడు, మరి ఫ్యూచర్ లో ఈ సినిమా నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here