కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అదరగొట్టే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాయి. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో తమిళ్ మరియు తెలుగు లో దుమ్ము దుమారం చేసింది. తెలుగు లో సినిమా విజయ్ కెరీర్ లోనే…
ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమా యావరేజ్ రేంజ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం పండగ హాలిడేస్ లో నే దుమ్ము లేపిన ఈ సినిమా తర్వాత లాంగ్ రన్ ని 2 వారాల పాటు సాఫీగానే సాగించగా తర్వాత కొత్త సినిమాల వలన…
పరుగును స్లో అయ్యి పూర్తీ చేసుకుంది ఈ సినిమా. టోటల్ రన్ పూర్తీ అయ్యే టైం కి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని విజయ్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఇది వరకు విజిల్ సినిమా 11.57 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా…
ఇప్పుడు ఆ రికార్డ్ ను మాస్టర్ సినిమా బ్రేక్ చేసి సరికొత్త కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో పరుగు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 3.56Cr
👉Ceeded: 2.71Cr
👉UA: 2.51Cr
👉East: 1.34Cr
👉West: 1.25Cr
👉Guntur: 1.41Cr
👉Krishna: 1.17Cr
👉Nellore: 65L
AP-TG Total:- 14.60CR (24.80Cr Gross~)
ఇదీ సినిమా ఏరియాల వారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన అల్టిమేట్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద 8 కోట్ల రేంజ్ రేటు కి అమ్మాగా సినిమా 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 6.10 కోట్ల ప్రాఫిట్ ని టార్గెట్ మీద సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ తెలుగులో సూపర్ మార్కెట్ సొంతం అయ్యేలా చేసిన సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఇక అప్ కమింగ్ మూవీస్ కి తెలుగు లో రచ్చ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.