Home గాసిప్స్ లాక్ డౌన్ ఎఫెక్ట్…విజయ్ దేవరకొండ ఫైటర్ లో మార్పులు ఇవే!!

లాక్ డౌన్ ఎఫెక్ట్…విజయ్ దేవరకొండ ఫైటర్ లో మార్పులు ఇవే!!

95
0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కి హిట్స్ కి ఫ్లాఫ్స్ కి తేడా లేకుండా ఆడియన్స్ లో సాలిడ్ క్రేజ్ ఉంది, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మరియు టాక్సీ వాలా సినిమా లతో తనకంటూ సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ టైం లో డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిసాస్టర్లు పడ్డా విజయ్ దేవరకొండ న్యూ మూవీ పై మంచి బజ్ ఉంది.

దానికి కారణం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా నే.. లాస్ట్ ఇయర్ ముందు వరకు అపజయాలను ఎదురుకున్న పూరీ జగన్నాథ్ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవల్ లో ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రీసెంట్ టైం లో క్రమం తప్పకుండా సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తో హిందీ లో కూడా ఎంటర్ కాబోతున్నాడు…

ఇక లాక్ డౌన్ వలన వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ చేయడం ఇతర రాష్ట్రాల యాక్టర్స్ ఇక్కడ కు వచ్చి షూటింగ్ చేయడం ప్రస్తుతం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి టోటల్ షూటింగ్ ని హైదరాబాదు లోనే తీయాలని యూనిట్ భావిస్తుందట. ఇక సినిమాలో ముంబై లో షూట్ చేయాల్సిన చాలా సీన్స్ కూడా హైదరాబాదు లోనే తీస్తున్నారట.

సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ కాబట్టి ఫారన్ యాక్టర్స్ తో ఫైట్ సీన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు అవన్నీ మార్చి దేశీ ఫైట్ సీన్స్ తో సినిమా కాన్సెప్ట్ ని కూడా మార్చుతున్నట్లు తెలుస్తుంది, మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యాక చెప్పగలం. సినిమా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here