Home గాసిప్స్ విజయ్ సేతుపతి ఉప్పెనకి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

విజయ్ సేతుపతి ఉప్పెనకి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

1056
0

తమిళ్ లో నాచురల్ యాక్టర్ గా మంచి పేరు ను సొంతం చేసుకున్న హీరో విజయ్ సేతుపతి… తన నాచురల్ యాక్టింగ్ తో మెప్పించిన విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కి కూడా సైరా తో పరిచయం ఏర్పడగా ఇప్పుడు ఉప్పెన సినిమా లో మెయిన్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే, ఎప్పుడో సమ్మర్ రేసులో నిలిచిన ఈ సినిమా కరోనా వలన రిలీజ్ ఆగిపోగా… తర్వాత డైరెక్ట్ రిలీజ్ అవుతుంది అనుకున్నా…

ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెబుతూ వస్తున్న ఈ సినిమా యూనిట్ త్వరలో సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సినిమా బడ్జెట్ కూడా 20 కోట్లకు పైగా అవ్వగా సినిమాకి పనిచేసిన వారందరి లోకి విజయ్ సేతుపతి కి హైయెస్ట్ రెమ్యునరేషన్ వెళ్ళినట్లు సమాచారం.

తమిళ్ లో ఒక్కో సినిమాకి అవలీలగా 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ ఉండగా తెలుగు లో చేసిన విలన్ రోల్ కి గాను ఏకంగా 4.5 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకున్నారని సమాచారం… అంటే ఓవరాల్ బడ్జెట్ లో నాలుగో వంతు విజయ్ సేతుపతికే వెళ్ళింది అని చెప్పొచ్చు.

సినిమాలో రోల్ కి అంత ఇంపార్టంట్స్ ఉండటం అందునా కొత్త వాళ్ళతో చేస్తున్న సినిమా అవ్వడం తో మరింత ఫ్రెష్ నెస్ కోసం ట్రై చేయాలనీ ఎప్పుడూ విలన్ రోల్ చేయని విజయ్ సేతుపతి ని ఈ సినిమా కోసం అప్రోచ్ అవ్వగా కథ నచ్చి వెంటనే సినిమాను ఓకే చేసి తక్కువ డేట్స్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ని తీసుకున్నారని అంటున్నారు.

విజయ్ సేతుపతిని తీసుకోవడంతో తమిళ్ లో కూడా సినిమాను రిలీజ్ చేస్తారు అనుకున్నా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమాలోని సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా కచ్చితంగా థియేటర్స్ లోనే మంచి డేట్ చూసుకుని రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here