Home న్యూస్ ఇదేం మాస్ రా బాబు….55 కోట్లు ఔట్…చెడుగుడు ఆడేస్తున్న దళపతి!

ఇదేం మాస్ రా బాబు….55 కోట్లు ఔట్…చెడుగుడు ఆడేస్తున్న దళపతి!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ రీసెంట్ విజయ్ మూవీస్ తో పోల్చితే మరీ అనుకున్న రేంజ్ లో హైప్ ను అయితే సొంతం చేసుకోలేక పోయినా కూడా ఇప్పుడు రిలీజ్ రోజు దగ్గర పడుతున్న కొద్ది ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం పెరిగిపోతూ ఉండటం విశేషం.

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా స్టార్ట్ అవ్వగా రిమార్కబుల్ బుకింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ ఉండగా తమిళనాడులో అల్టిమేట్ బుకింగ్స్ వీకెండ్ మొత్తానికి స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మాత్రం మరో లెవల్ లో ఉండటం విశేషం అని చెప్పాలి.

మొదటి రోజు బుకింగ్స్ తో పాటు టోటల్ వీకెండ్ బుకింగ్స్ కలిపి తమిళనాడులో సినిమా 25 కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బుకింగ్స్ లెక్కలు ఆల్ మోస్ట్ 5 కోట్ల మార్క్ ని అందుకోగా ఇండియా లోనే టోటల్ బుకింగ్స్ వీకెండ్ గ్రాస్ లెక్క…

30 కోట్ల రేంజ్ దాకా ఉండగా ఇక ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా ఆల్ రెడీ 3 మిలియన్ డాలర్స్ బుకింగ్స్ ను దాటేసింది…ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 25 కోట్ల మార్క్ ని దాటేసింది. దాంతో ఆల్ మోస్ట్ సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్..

వరల్డ్ వైడ్ గా వీకెండ్ కి గాను 55 కోట్లకు పైగా ఉండగా సినిమా మొదటి రోజు ఇప్పుడు రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా టాక్ ఏమాత్రం బాగున్నా పెద్దగా హైప్ లేని సినిమాతో లియో మూవీ తర్వాత సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here