Home న్యూస్ “ది గోట్” ట్రైలర్ రివ్యూ….600 కోట్ల హీరో మళ్ళీ రచ్చ లేపేలా ఉన్నాడు!

“ది గోట్” ట్రైలర్ రివ్యూ….600 కోట్ల హీరో మళ్ళీ రచ్చ లేపేలా ఉన్నాడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుంటూ రచ్చ లేపుతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) లాస్ట్ ఇయర్ లియో మూవీతో మిక్సుడ్ టాక్ తో కూడా ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించాడు.

ఇక ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతూ ఉండగా విజయ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా మీద అంతగా బజ్ అయితే ఏమి లేదు అనే చెప్పాలి.

పాటలు క్లిక్ అవ్వలేదు, ప్రమోషన్స్ అంతంతమాత్రమే జరుగుతూ ఉండగా సినిమా మీద హైప్ ను పెంచడానికి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది…

కథ పాయింట్ ట్రైలర్ లో కొంచం చెప్పినా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఎన్నో సక్సెస్ ఫుల్ మిషన్స్ కి పని చేసిన స్పై ఏజెంట్ అయిన హీరో రిటైర్ మెంట్ తీసుకున్న తర్వాత తన ఫ్యామిలీ మీద హీరో చేతిలో దెబ్బ తిన్న విలన్ పగ తీర్చుకోవాలని చూస్తాడు…

ఇలాంటి టైం రిటైర్ అయిన హీరో తిరిగి చార్జ్ చీసుకుని ఏం చేశాడు, అలాగే తన లానే ఉన్న తన కొడుకుతో కలిసి విలన్ ని ఎలా కనిపెట్టాడు అన్న కాన్సెప్ట్ తో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతూ ఉండగా… ఓవరాల్ గా ట్రైలర్ క్వాలిటీ ఎక్స్ ట్రీం రిచ్ లెవల్ లో ఉండగా…

భారీ బడ్జెట్ తో భారీ కాన్వాయ్ తో సినిమాను రూపొందించారని అర్ధం అవుతుంది. ఇక సినిమాలో డీ ఏజింగ్ టెక్నాలజీ తో యంగ్ విజయ్ లుక్స్ ను చూపించగా ఫోటోలలో అంతంతమాత్రమే అనిపించినా ట్రైలర్ లో మాత్రం క్వాలిటీ బాగా మెప్పించింది… ఇక సినిమా కూడా ట్రైలర్ రేంజ్ లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి విజయ్ మాస్ జాతర చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here