బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ లియో మూవీతో మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవ్వగా విజయ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే…
ఈ సినిమాకి బజ్ అయితే కొంచం తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ లియో మూవీ మిక్సుడ్ టాక్ తోనే 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం, అలాగే విజయ్ నటించే లాస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమాను చెబుతూ ఉండటంతో…
కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ భీభత్సం ఈ సినిమా సృష్టించే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు. తెలుగు లో సినిమా బిజినెస్ కొంచం లిమిటెడ్ గానే జరిగింది, అలాగే వరల్డ్ వైడ్ గా కూడా సినిమా వాల్యూ బిజినెస్ మరీ భారీ రేట్స్ కి ఏమి అమ్మలేదు…
ఒకసారి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే..
The Greatest Of All Time Movie Total World Wide Pre Release Business(Valued)
👉Tamilnadu – 76Cr
👉Telugu States- 21Cr
👉Karnataka- 11Cr
👉Kerala – 15Cr
👉ROI – 7Cr
👉Overseas – 55CR~
Total WW Business – 185CR(Break Even – 187CR~)
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్….సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 375 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది…మిక్సుడ్ టాక్ తో 600 కోట్లు కొట్టిన..
విజయ్ కి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా ఈ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి కానీ కొంచం బజ్ తక్కువగా ఉండటంతో పాజిటివ్ టాక్ అవసరం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో విజయ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.