బాక్స్ ఆఫీస్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా తర్వాత అనుకున్న రేంజ్ లో సినిమాలు పడక పోవడంతో ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉన్నప్పటికీ సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ ను కచ్చితంగా షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో…
పాన్ ఇండియా రేంజ్ లో కొత్త సినిమా చేస్తూ ఉండగా, రీసెంట్ గా సినిమా టైటిల్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు. టీసర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనే చెప్పాలి. సినిమా కి అఫీషియల్ గా కింగ్ డం అనే టైటిల్ ను కన్ఫాం చేయగా…
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) వాయిస్ ఓవర్ తో టీసర్ ను లాంగ్ చేశారు, ఎన్టీఆర్ పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ వాయిస్ ఓ రేంజ్ లో హై ఇవ్వగా ఒక సామాన్య వ్యక్తి ఒక సామ్రాజయాన్ని ఎలా క్రియేట్ చేయాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన టీసర్ లో…
పెద్దగా స్టోరీ ని ఏమి రివీల్ చేయలేదు కానీ ఉన్నంతలో విజువల్స్ పరంగా కానీ అనిరుద్ అందించిన ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ టీసర్ కి భారీగా హైలెట్ గా నిలిచాయి. ఇక టీసర్ ఎండ్ లో విజయ్ దేవరకొండ న్యూ లుక్ అండ్ డైలాగ్ కూడా హైలెట్ అయినా కూడా ఓవరాల్ గా టీసర్ కి…
ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ మేజర్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు ఈ మే నెలలో 30న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫాం చేశారు… ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ లేపుతాడో చూడాలి ఇప్పుడు.