లాస్ట్ ఇయర్ లియో మూవీ తో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ, ఇప్పుడు భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 6000 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ గా…
రిలీజ్ కి సిద్దం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఆల్ మోస్ట్ 450 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది, ఇక అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 2 కోట్ల రేంజ్ లో…
ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు షో షోకి జోరు చూపిస్తే 3.5-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది….టాక్ ను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు . ఇక తమిళనాడులో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్స్ లెంట్ గా బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ ఇండియాలో టోటల్ ఫస్ట్ డే ప్రీ బుకింగ్స్ లెక్క 25 కోట్ల మార్క్ కి అందుకోగా ఓవర్సీస్ లో రిమార్కబుల్ బుకింగ్స్ తో రచ్చ చేస్తూ 23 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను అందుకోగా…
ఓవరాల్ గా ఫస్ట్ డేకి గాను అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 48 కోట్ల మార్క్ ని అందుకోగా మొదటి రోజు సినిమా ఇదే రేంజ్ లో జోరు చూపించి షో షోకి కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తే 85-90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు.
ఇక టాక్ బాగుండి అన్ని చోట్లా అంచనాలను మించి పోయే రేంజ్ లో షో షోకి జోరు పెరిగితే ఈ లెక్క 100 కోట్లకు అటూ ఇటూగా వెళ్ళే ఛాన్స్ కూడా ఎంతైనా ఉంది. మరి దళపతి విజయ్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.