బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ మొదటి రోజు సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ ఇప్పుడు టోటల్ టాలీవుడ్ కే మైండ్ బ్లాంక్ చేశాయి అని చెప్పాలి. మీడియం రేంజ్ హిరోలల్లో ఫస్ట్ టైం ఓపెనింగ్స్ పరంగా 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనుకున్న తరుణంలో సినిమా కి వచ్చిన కంప్లీట్ నెగటివ్ రెస్పాన్స్ ఓ రేంజ్ లో దెబ్బ కొట్టింది.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి ఈ ఎదురుదెబ్బ ఓ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించింది, కొన్ని సెంటర్స్ లో యాడ్ అవ్వాల్సిన హైర్స్ సడెన్ గా కాన్సిల్ అయ్యాయి. కానీ మినిమమ్ 11 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ లైగర్ 10 దగ్గరకు కూడా వెళ్ళలేకపోయింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది, అందులో 43 లక్షల హైర్స్ యాడ్ అవ్వగా వర్త్ షేర్ 9.14 కోట్ల రేంజ్ లో ఉంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13.45 కోట్ల షేర్ నే అందుకుని మైండ్ బ్లాంక్ చేసింది.
ఒకసారి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 4.24Cr
👉Ceeded: 1.32Cr
👉UA: 1.27Cr
👉East: 64L
👉West: 39L
👉Guntur: 83L(31L Hires)
👉Krishna: 48L
👉Nellore: 40L(12L Hires)
AP-TG Total:- 9.57CR(15.40CR~ Gross)(43L Hires)
👉KA+ROI – 55L
👉Other Languages – 22L
👉North India – 55L~
👉OS – 2.56Cr
Total World Wide – 13.45CR(24.30CR~ Gross)
ఓవరాల్ గా ఇది కూడా టైర్ 2 హీరోల పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ అయినా కానీ కేవలం తెలుగు రాష్ట్రాలలోనే మొదటి రోజు వస్తాయి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న లైగర్ 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 76.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు.