లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు మంచి బజ్ తో వస్తున్న లేటెస్ట్ మూవీ విక్రం. మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక తెలుగు రైట్స్ 7 కోట్లకు అమ్మగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా ఎక్కువే జరిగింది అని చెప్పాలి….
సినిమా మొత్తం మీద నైజాం లో 2.80 కోట్ల బిజినెస్ ను అందుకోగా సీడెడ్ లో 1.55 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఇక ఆంధ్రలో సినిమా మొత్తం మీద 3.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్….
8 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 8.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. టాక్ బాగుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది…